విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.15.11.2024 శుక్రవారం నాడు విజయవాడ లోని “Joyalukkas Jewellery, ఎం.జీ రోడ్, వివంత హోటల్ పక్కన, లబ్బీపేట్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు (FAC) మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేసారు.
ఈ జాబ్ మేళాలో, Joyalukkas Jewellery కంపెనీ కి సంబందించి సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ట్రైనీ ఓపెనింగ్స్ కు ఇంటర్వ్యూలు నిర్వహిస్తునమని తెలిపారు. ఈ కంపెనీలో గల ఉద్యోగాలకు 18 నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఏదైనా డిప్లొమా, గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులని, ఎంపిక అయిన వారికి మoచి వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, నవంబర్ 15 న నిర్వహించబోయే ఈ జాబ్ మేళాలకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు తెలిపారు.
ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://tinyurl.com/jobmela-naipunyam లింక్ నందు తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్ మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని, మరిన్ని వివరాలకు 0866 2491916, 8978777585 నంబర్ను సంప్రదించాలని తెలిపారు.
Prajavartha Online Telugu News