విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు ఇచ్చిన హామీ మేరకు మొదటి బడ్జెట్లోనే రూ.151 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు స్వామి దాస్ తెలిపారు. శుక్రవారం గాంధీనగర్లోని నిర్వహించిన సమావేశంలో విలేకరుల ఆయన మాట్లాడుతూ వైకాపా క్రైస్తవుల ఓట్లతో గెలిచి వైకాపా ప్రభుత్వ హయంలో బడ్జెట్లో కనీసం రూపాయి కూడా కేటాయింపులు చేయలేదని కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు ఇచ్చిన హామీ మేరకు మొదటి బడ్జెట్లోనే రూ.151 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. పాస్టర్లకు గౌరవ వేతనం, నిరుద్యోగులకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు, విదేశీ విద్యాపథకం వంటి వాటికి ఈ నిధులను కేటాయించారన్నారు. క్రైస్తవుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న చిత్తశుద్ధిని మొదటి బడ్జెట్లోనే కేటాయింపులు చేసి నిరూపించుకున్నారన్నారు. క్రైస్తవులకు అమలు చేస్తున్న 11 రకాల పథకాలను గతంలో వైకాపా ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ పథకాలను తిరిగి పునరుద్ధరించి క్రైస్తవులను ఆదుకుంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులకు బడ్జెట్లో చేసిన కేటాయింపుల గురించి క్రైస్తవులకు ప్రచారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జూలై నాటికి గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలిస్తాం.
-పోలవరం లెఫ్ట్ కెనాల్ పెండింగ్ పనులకు టెండర్లు పూర్తి. -ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ కు నిధుల కేటాయింపు -2027 …