విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-విజయవాడ.. ఎంపవర్ హెర్ అండ్ పవర్ హిమ్ కార్యక్రమం కింద కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో వసతిగృహ విద్యార్థులకు చేయూతనందించింది. ఈ మేరకు శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో బ్యాంకు ప్రతినిధులు పాయకాపురంలోని మూడు వసతిగృహాలకు 30 సీలింగ్ ఫ్యాన్లు, 30 ట్యూబ్‌లైట్లు, మూడు వెట్ గ్రైండర్లు, మూడు మిక్సీలు, మూడు గ్యాస్ స్టవ్‌లు అందజేశారు. అదే విధంగా రెండువేల లీటర్ల సామర్థ్యమున్న సింటెక్స్ నీటి ట్యాంకు, దోమల తెరలతో పాటు అమ్మాయిలకు శానిటరీ న్యాప్‌కిన్స్ అందజేశారు. కార్యక్రమంలో యూబీఐ జోనల్ మేనేజర్ సీవీఎన్ భాస్కరరావు, రీజనల్ మేనేజర్ ఎం.శ్రీధర్, డిప్యూటీ జోనల్ మేనేజర్ శారదా మూర్తి, డిప్యూటీ రీజనల్ మేనేజర్లు ఐఎస్ఎస్ మూర్తి, హరీష్ బేతా, ఏజీఎం (ఎస్ఎల్‌బీసీ) డి.శ్రీనివాస్, చీఫ్ మేనేజర్ ప్రవీణ, ఎన్‌టీఆర్ జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి కె.శ్రీనివాసరావు, జిల్లా ఎల్‌డీఎం కె.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జూలై నాటికి గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలిస్తాం.
-పోలవరం లెఫ్ట్ కెనాల్ పెండింగ్ పనులకు టెండర్లు పూర్తి. -ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ కు నిధుల కేటాయింపు -2027 …