Breaking News

Tag Archives: karnul

‘తుంగభద్ర’ చరిత్రలో అత్యధిక విద్యుత్ ఉత్పత్తి, నీటి వినియోగం సీఎం జగన్ పరిపాలనలోనే : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

-జూలై 15 కల్లా ‘హగరి అక్వెడిక్ట్’ శాశ్వత పునరుద్ధరణ పనులు పూర్తి కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : జూలై 15 కల్లా ‘హగరి అక్వెడిక్ట్’ శాశ్వత పునరుద్ధరణ పనులు పూర్తి చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.’తుంగభద్ర’ చరిత్రలోనే అత్యధిక విద్యుత్ ఉత్పత్తి, నీటి వినియోగం నమోదైన సంవత్సరాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో కావడం విశేషమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హోస్పేట్ లోని ‘తుంగభద్ర’ డ్యామ్ ని పరిశీలించారు. …

Read More »

సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ క్లీనిక్ (ఎస్‌ఎల్‌ఐ) ప్రారంభం

క‌ర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : పెరుగుతున్న కాలేయ వ్యాధిని దృష్టిలో పెట్టుకుని ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే సూప‌ర్ స్పెషాలిటీ క్లీనిక్‌ను ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని మాజీ మంత్రి టి.జి.వెంక‌టేష్ అన్నారు. ప్ర‌ఖ్యాతి గాంచిన లివ‌ర్ వైద్య నిపుణుడు ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ టామ్ చెరియ‌న్ నేతృత్వంలో క‌ర్నూలులోని వీఆర్ హాస్ప‌ట‌ల్‌లో ఏర్పాటు చేసిన సూప‌ర్ స్పెషాలిటీ క్లీనిక్‌ను టి.జి.వెంక‌టేష్ ఆదివారం నాడు ముఖ్య అతిథిగా హాజ‌రై లాంఛ‌నంగా ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, చాలామంది కాలేయ వ్యాధితో బాధ‌ప‌డుతూ స‌రైన వైద్యం అంద‌క తీవ్ర అనారోగ్యానికి …

Read More »

రాహుల్ పాదయాత్ర తో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగింది

-ఏపీలో భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో ఎఐసీసీ నేతలు.. దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్ కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర కు దేశ ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుందని, అందుకే బీజేపీ, ఆర్.యస్.యస్ నేతలు భయపడుతున్నారని ఎఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాష్ట్ర విభజన తరవాత బీజేపీ ప్రభుత్వం ఏపీ కి విభజన చట్టం అంశాలు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎపీకి అన్యాయం చేశాయని గుర్తు చేశారు. బీజేపీ రాజ్యాంగాన్ని బలహీనపరచి, …

Read More »

గుంటూరు, విజయవాడ లలో హెచ్‌ఆర్‌సీ క్యాంపు కోర్టుల నిర్వహణ…

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సెప్టెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు గుంటూరు, విజయవాడ లలో హెచ్‌ఆర్‌సీ క్యాంపు కోర్టులు నిర్వహించనున్నట్లు కమిషన్ కార్యదర్శి సంపర వెంకట రమణ మూర్తి కమిషన్ వారి ఆదేశాల ప్రకారం ప్రకటించారు. ఈ క్యాంపు కోర్టు నందు  కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి మరియు కమిషన్ సభ్యులు (జుడీషియల్) దండే సుబ్రహ్మణ్యం, కమిషన్ సభ్యులు (నాన్ జుడీషియల్) డాక్టర్ శ్రీనివాస రావు గోచిపాతలు పాల్గొన్ని ఆయా తేదీల్లో …

Read More »

ఫోన్ పోతే పోలీసు వెబ్ సైట్ లో అప్లై చేయండి… : ఎస్పీ సిద్దార్థ్ కౌశల్

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా మొదటి సారిగా కర్నూలు పోలీసులు అతి తక్కువ సమయంలోనే వివిధ రాష్ట్రాల నుండి రికవరీ చేసిన 564 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదివారం బాధితులకు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరడ్ మైదానంలో “మొబైల్ రికవరీ మేళా” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఏర్పాటు చేశారు. కర్నూలు పోలీసులు ముందు రోజే ఫోన్లను అందజేసేందుకు బాధితులకు సమాచారం అందించి కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంకు పిలిపించి బాధితులకు సెల్ ఫోన్లను అందజేశారు. ఈ …

Read More »

వృత్తి లో నైపుణ్యం వస్తే దర్యాప్తు సమగ్రంగా చేయవచ్చు …

-జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ -శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తులలో మెళకువల గురించి (JIO) పోలీసు జూనియర్ ఇన్వేస్టిగేషన్ అధికారులకు ప్రాక్టికల్ గా ముగింపు శిక్షణ కార్యక్రమం. -వినూత్న పద్ధతిలో మాక్ కోర్టు వాతావరణం సృష్టించి కేసుల సాక్ష్యాలు, ఎగ్జామినేషన్ పై శిక్షణ కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త: రెండో బ్యాచ్ లో 25 మంది పోలీసులకు 5 రోజుల పాటు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో పోలీసు జూనియర్ ఇన్వేస్టిగేషన్ అధికారులకు ప్రత్యేక ముగింపు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దర్యాప్తు చేయడంలో కావాలసిన …

Read More »

విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి… : మంత్రి ఆర్.కె.రోజా 

-దేశానికి ఆదర్శప్రాయంగా క్రీడాకారులు నిలవాలి -విద్యార్థుల మనో వికాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి -కర్నూల్ నగర ఔట్ డోర్ స్టేడియంలో సుమారు 70 లక్షలతో ఏర్పాటు చేసిన జిమ్నాస్టిక్స్ ఎక్విప్మెంట్ ప్రారంభం కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి క్రీడాకారులు ఆదర్శప్రాయంగా నిలవాలని క్రీడాశాఖామంత్రి ఆర్.కె.రోజా వ్యాఖ్యానించారు. పిల్లలు విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యమివ్వాలన్నారు. కర్నూలు నగరంలోని ఔట్ డోర్ స్టేడియం నందు సుమారు 70 లక్షలతో ఏర్పాటు చేసిన జిమ్నాస్టిక్స్ ఎక్విప్మెంట్ ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి మరియు …

Read More »

సీఎం జగన్‌ చేతులమీదుగా గ్రీన్‌కో ప్రాజెక్టు శంకుస్థాపన…

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా వద్ద మంగ‌ళ‌వారం ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. గుమ్మటం తండ వద్ద నున్న ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు (గ్రీన్‌కో) ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం వరల్డ్‌ లార్జెస్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ (గ్రీన్‌కో) ప్రాజెక్టు శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌. మాట్లాడుతూ… ఒక అద్భుతమైన చారిత్రక …

Read More »

గవర్నర్ కు హక్కుల కమిషన్ (హెచ్ ఆర్ సి) వార్షిక నివేదిక అందించనున్న కమిషన్ ఛైర్మెన్, సభ్యులు…

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వారిచే రూపొందించిన వార్షిక నివేదికను గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కి అందించేందుకు గాను  కమిషన్ ఛైర్మెన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, కమిషన్ సభ్యులు (జుడిషియల్) దండే సుబ్రహ్మణ్యం, సభ్యులు (నాన్ జుడీషియల్) డాక్టర్ శ్రీనివాస రావు గోచిపాత లు శుక్రవారం ఉదయం విజయవాడ లోని రాజభవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కి కమిషన్ వార్షిక నివేదిక అందించనున్నారు. అనంతరం కమిషన్ విజయవాడ …

Read More »

పార్టీ సభ్యత్వం చేయించిన వారికి పార్టీలో ప్రాధాన్యత – డాక్టర్ సాకే శైలజానాథ్

-దేశ ప్రజలు బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి – ఏఐసీసీ కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు సిడి.మెయ్యప్పన్ కర్నూల్, నేటి పత్రిక ప్రజావార్త : కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం చేయించిన వారికి కాంగ్రెస్ పార్టీలో మరియు పదవులలో అదిక ప్రాధాన్యత ఉంటుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ హామీ ఇచ్చారు. ఈ రోజు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు అహమ్మద్‌ అలీ ఖాన్ అధ్యక్షతన జరిగిన డిజిటల్ సభ్యత్వ నమోదు …

Read More »