Breaking News

వృత్తి లో నైపుణ్యం వస్తే దర్యాప్తు సమగ్రంగా చేయవచ్చు …

-జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్
-శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తులలో మెళకువల గురించి (JIO) పోలీసు జూనియర్ ఇన్వేస్టిగేషన్ అధికారులకు ప్రాక్టికల్ గా ముగింపు శిక్షణ కార్యక్రమం.
-వినూత్న పద్ధతిలో మాక్ కోర్టు వాతావరణం సృష్టించి కేసుల సాక్ష్యాలు, ఎగ్జామినేషన్ పై శిక్షణ

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త:
రెండో బ్యాచ్ లో 25 మంది పోలీసులకు 5 రోజుల పాటు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో పోలీసు జూనియర్ ఇన్వేస్టిగేషన్ అధికారులకు ప్రత్యేక ముగింపు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దర్యాప్తు చేయడంలో కావాలసిన నైపుణ్యం , మెళకువలు, అత్యంత శాస్త్రీయ పద్దతిలో ఎంతో ఉన్నత ప్రమాణాలతో దర్యాప్తు అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ  సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. జిల్లాలో సుమారు దర్యాప్తులు పూర్తి కాని వేల కేసులు ఉన్నాయన్నారు. దర్యాప్తు చేయడానికి అర్హత గల హెడ్ కానిస్టేబుల్స్ / ఎఎస్సైలు / ఎస్సైలు సుమారుగా 500 మంది ఉన్నారన్నారు. కాని అందులో 80 శాతం సిబ్బందికి దర్యాప్తు విధానం తెలియకపోవడం వలన అన్ని కేసుల దర్యాప్తులు కూడా పెండింగ్ లో ఉండి పోయాయన్నారు. జిల్లా ఎస్పీ గా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రత్యేకంగా పెండింగ్ కేసుల పై ప్రత్యేక దృష్టి సారించమన్నారు. ఈ పెండింగ్ కేసుల పై అధ్యయనం చేసి సరైన సమయానికి దర్యాప్తులు పూర్తి కాకపోవడం వల్లనే బాధితులకు సరైన సమయంలో న్యాయం జరగడం లేదని భావించామన్నారు. న్యాయం కోసం బాధితులు సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సిన పరిస్ధితి ఏర్పడిందని గుర్తించామన్నారు. JUSTICE DELAYED JUSTICE DENIED అనే సిద్ధాంతాన్ని నమ్మి బాధితులకు త్వరితగతిన , సకాలంలో న్యాయం అందించే ప్రణాళికా కార్యాచరణ సిధ్దం చేశామన్నారు. అందులో భాగంగానే మొదటగా హెడ్ కానిస్టేబుల్స్ / ఎఎస్సైలు దర్యాప్తు చేయక పోవడానికి కారణం చూడగా వారికి దర్యాప్తు చేయడంలో నైపుణ్యం , మెళకువలు తెలియకపోవడం, వారికి సరైన రీతిలో దర్యాప్తు చేయడానికి శిక్షణ సరిపోకపోవడం మరియు దర్యాప్తు చేయడానికి వారిలో భయం ఉండడం వంటి అంశాలను గమనించామన్నారు.

ఎఎస్సై, హెడ్ కానిస్టేబుళ్ళ ను జూనియర్ ఇన్వేస్టిగేషన్ అధికారులుగా ( JIO) నామ కరణం చేసి ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించి వారిలో ధైర్యం నింపి మరియు వారికి మెళకువలు నేర్పించడానికి జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో 5 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం రూపొందించామన్నారు. శిక్షణలో భాగంగా జూనియర్ ఇన్వేస్టిగేషన్ అధికారులకు కేసు ఫైల్, ఎఫ్ ఐ. ఆర్, స్టేట్ మెంట్స్ , నేర స్ధల పరిశీలన, అరెస్టు , రిమాండులు, నేర స్ధల రఫ్ స్కేచ్ మొదలైన వాటిని వారే స్వంతంగా తయారు చేసి కేసు ఫైల్ మొత్తం రాసి టీమ్ ల ద్వారా సదరు పైళ్ళ ను ఒక టీమ్ వారు మరియొక్క టీమ్ యొక్క లోపాలను గుర్తించి దానిని చర్చించి సవరించే విధంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చివరి రోజు కేసు దర్యాప్తు మొత్తం కేసు ఫైల్ ను , పూర్తి చేసి తర్వాత ఒక మోడల్ కోర్టు వాతావరణం ఏర్పాటు చేసి అందులో జడ్జి, ప్రాసి క్యూటర్ , డిఫెన్స్ లాయర్ ఏర్పాటు చేసి వారికి సాక్ష్యాన్ని కోర్టులో ఎలా చెప్పాలి అనే దానిని ప్రాక్టికల్ గా నేర్పించడం జరిగిందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం లో పాల్గొన్న శిక్షణార్ధులు ఎంతో ఆత్మ విశ్వాసంతో తాము ఇంతవరకు దర్యాప్తులు చేయలేదని , ఈ శిక్షణ తర్వాత ఏవరి సహాయం లేకుండా తామే స్వంతంగా దర్యాప్తు చేసి కేసు ఫైల్ ను మేమే రాయగలిగే నేర్పు ఈ శిక్షణ ద్వారా వచ్చిందన్నారు. జూనియర్ ఇన్వేస్టిగేషన్ దర్యాప్తు అధికారులు ఈ శిక్షణా కార్యక్రమం పూర్తి చేయడంతో జిల్లాలోని కేసులన్నీ త్వరిత గతిన కేసులు పరిష్కారం అయి బాధితులకు న్యాయం జరుగుతుందని కోరుతున్నామన్నారు.

మంచి ప్రణాళికలతో దర్యాప్తు నేర్పించడానికి చేసిన కృషి వలన తాము కూడా కేసుల దర్యాప్తులు చేసి వృత్తిలో నైపుణ్యం సాధించడానికి ఆత్మ స్ధైర్యాన్ని నింపిన జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ శిక్షణ కార్యక్రమాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటామని జూనియర్ దర్యాప్తు అధికారులు ( JIO) తెలియజేశారు. స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ వెంకటాద్రి, డిటిసి సిఐ శివశంకర్ పూర్తి స్ధాయి శిక్షణ ను బోధించారన్నారు. మాక్ కోర్టులో జడ్జీగా పాత్ర పోషించిన ఏపీపీ సుస్మిత , ఏపీపీ సుబ్బయ్య, ఏపీపీ శ్రీనివాసు లకు జూనియర్ దర్యాప్తు అధికారులు ( JIO) ప్రత్యేక ధన్యవాధాలు తెలిపారు. జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ ఐపియస్ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ వెంకటాద్రి, డిటిసి సిఐ శివశంకర్ లను ప్రత్యేకంగా అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *