Breaking News

ఇంటి నిర్మాణం పూర్తి అయిన వాటి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయండి

-పూర్తి అయిన ఇండ్లకు ఉచితంగా విద్యుత్ మీటర్లు , కనెక్షన్లు అందచేస్తున్నాం
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో హౌసింగ్ నిర్మాణాల పురోగతిలో పూర్తి నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోందని గత వారం కంటే ఈ వారం పురోగతి చాలా తక్కువగా ఉందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత , జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ లు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి హౌసింగ్ పై జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల , ప్రత్యేక అధికారులతో విసి ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నియోజక వర్గం పరిధిలో వెయ్యి ఇంటి నిర్మాణాల స్టేజ్ దశల వారీగా ప్రగతి నిర్ణయం ఇచ్చామన్నారు. మీరు సాధ్యం అవుతుందని చెప్పిన లక్ష్యాలను సాధించడానికి ఎందుకు చెయ్యలేక పోతున్నారని ప్రశ్నించారు.పెరవలి మండల పరిధిలోని హౌసింగ్ లే అవుట్ ఇంటి నిర్మాణం కు ఎంతో అనువుగా ఉన్నాయని, అయినా ఇంకా ఎందుకు చెయ్యలేక పోతున్నారు.

కాతేరు సాండ్ బ్యాంకు నుంచి ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, ఇళ్ళ లబ్దిదారుల ఇంటి కోసం మాత్రమే సద్వినియోగం చేసుకోవాలన్నారు.  షిఫ్ట్ వారి వి ఆర్ వో లకు విధులు కేటాయించి పూర్తి స్థాయి పర్యవేక్షణ అవసరం అన్నారు.  ఇతర వాటికి కేటాయింపు జరిగితే సంబంధించి తహశీల్దార్ బాధ్యత అన్నారు.  ప్రధానమంత్రి అవాస యోజన పథకం కింద రిజిస్ట్రేషన్ 6529 లు చేపట్టవలసి ఉండగా, ఎందుకు ప్రక్రియలో ప్రగతి సాధించలేక పోతున్నారని కలెక్టర్ వివరణ కోరడం జరిగిందన్నారు. ఇందులో ఏదైనా సాంకేతిక ఇబ్బందుల వల్ల చెయ్యలేకపోతే శనివారం సాయంత్రం కు ప్రతిపాదనకు పంపాలని ఆదేశించారు. ఇంటి నిర్మాణాలు వేగవంతం చెయ్యడానికి 60 వేల మందికి ఎస్ హెచ్ జి రుణాలు కల్పించాల్సి ఉండగా కేవలం 12 వేల మంది మేర ఇచ్చారని పేర్కొన్నారు.  ఇంటి నిర్మాణాలు పురోగతిలో ఎస్ హెచ్ జి మహిళలకు ముందస్తు ఆర్థిక సహాయం కీలకం అన్నారు.

పూర్తి చేసిన ఇండ్లకు విద్యుత్ శాఖ ద్వారా ఒక్క రూపాయి కూడా వసూలు చెయ్యకుండా మీటరు బిగించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మాధవీలత తెలిపారు. జిల్లాలో  పూర్తి చేసిన ఇండ్ల వివరాలు హౌసింగ్ వారు విద్యుత్ అధికారులకు తెలియ చేయాలన్నారు.   ఆయా లబ్దిదారుల జాబితా విద్యుత్ అధికారులకు వ్రాత పూర్వకంగా తెలియపర్చాలన్నారు. సచివాలయ పరిధిలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ “ఈ ఏ ” యాప్ లో ఇంటి నిర్మాణాలు, ఆయా ఇండ్ల నిర్మాణాలు దశల వారీగా జరుగుతున్న పనులు ఎప్పటి కప్పుడు  నమోదు చెయ్యాలని ఆదేశించారు. ఇప్పటికీ కూడా 23 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ యాప్ ద్వారా పనులు ప్రారంభం చెయ్యలేదని తెలియచేశారు. ఇసుక రవాణా కి కొందరు లారీ యజమానులు  సహకరించడం లేదని మండల అధికారులు పేర్కొనగా, అటువంటి  లారీ లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.  క్రిటికల్ గ్యాప్స్ విషయంలో లే అవుట్ లకు సంబందించి ఓటిఎస్ , నాన్ ఓటిఎస్ పనుల పై కలెక్టర్ సమీక్షించారు.  ఇప్పటికీ ఎనిమిది లే అవుట్ లలో క్రిటికల్ గ్యాప్స్ పెండింగ్ పనులు పూర్తి చెయ్యాలని స్పష్టం చేశారు.

జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, ప్రతి వారం వంద ఇంటి నిర్మాణాలకు స్టేజ్ కన్వర్షన్ తప్పనిసరిగా చెయ్యాలని నిర్దేశిస్తూన్నా ఆ మేరకు పురోగతి ఎందుకు సాధించలేక పోయారని ప్రశ్నించారు. ఈవారం కన్వర్షన్ లో పురోగతి ఎంపిడివో, సంబంధించిన  హౌసింగ్ ఏ ఈ లదే పూర్తి బాధ్యత అన్నారు. గతవారం కేవలం 3 శాతం సగటు ప్రగతి సాధించారని, గతవారం, ఈవారం లక్ష్యాలను కలిపి పూర్తి చెయ్యాలని ఆదేశించారు. స్టేజ్ కన్వర్షన్ ప్రణాళిక సిద్ధం చేసుకుని పని చేపట్టాలన్నారు.కన్వర్షన్ విషయంలో కూడా క్షేత్ర స్థాయి అధికారులు సిబ్బంది వ్యక్తిగత శ్రద్ద తీసుకొని పనిచేయాల్సి ఉందన్నారు. ఈవారం ప్రారంభం కానివి 330 లో  ఆరు , బిబిఎల్  27785,  బి ఎల్  6382, ఆర్ ఎల్  1683, కంప్లీట్ స్థాయి లో 2199 ఉన్నాయని వాటిని తదుపరి స్టేజ్ కి తీసుకుని వెళ్ళడం ద్వారా ప్రగతి చూపగలం అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా హౌసింగ్ అధికారి టి. తారాసింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ డి. బాల శంకర్, ఏపిఈపిడిసిఎల్ ఎస్ ఈ ఎన్. వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *