Breaking News

మంత్రి ఆర్.కే.రోజాని కలిసిన కామన్వెల్త్ బంగారు పతక విజేత పి.వి.సింధు…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త:
హైదరాబాద్ నోవేటెల్ లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసులు శాఖా మంత్రి ఆర్.కే.రోజాని మర్యాదపూర్వకంగా కామన్వెల్త్ బంగారు పతక విజేత పి.వి.సింధు కలిసారు. కామన్వెల్త్ క్రీడలు 2022 మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్లో విజేతగా నిలిచిన పివి సింధు కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి శ్రీమతి ఆర్.కే రోజానీ హైదరాబాద్ నోవెటేల్ లో కలిశారు. అనంతరం మంత్రి రోజా కుటుంబ సభ్యులు, సింధు కుటుంబ సభ్యులు కలసి లంచ్ లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నుండి అందించిన సహకారానికి సింధు కృతజ్ఞతలు తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్‌ సింగిల్స్ ఈవెంట్‌లో తొలి బంగారు పతకం సాధించిన సింధు విజయానికి యావత్ దేశం గర్విస్తోందనీ మంత్రి రోజా సిందుని కొనియాడారు. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి రోజా సిందుకి విషెస్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *