Breaking News

స్వచ్ఛోత్సవ ముగిసింది… స్వచ్ఛత కాదు

-స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛోత్సవ ముగిసింది… స్వచ్ఛత కాదని, స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యతని, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. గురువారము ఉదయం పాత గవర్నమెంట్ ప్రెస్, ముత్యాలంపాడు *స్వచ్ఛోత్సవ- స్వచ్ఛత హి సేవలో* ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17, 2025 తో మొదలైన స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో నిర్విరామంగా అక్టోబర్ 2, 2025 వరకు ప్రతిరోజు స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అందులో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు సింగిల్ యూస్ ప్లాస్టిక్ బాన్, రెడ్యూస్ రీ యూస్, రీసైకిల్ అంశంపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారని, మొక్కలను పెంచడం మిద్దె పైన తోటను ఏర్పాటు చేయడం, వ్యర్ధాల నుండి వస్తువులు తయారీ, పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం దృశ్య సఫాయిమిత్ర సురక్షశివిర్, ఒక గంటపాటు అందరూ కలిసి శ్రమదానం చేయటం, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటం కోసం టాయిలెట్లు కడుక్కోవాలని అవగాహన కార్యక్రమం, పర్యావరణహితమైన వస్తువులనే వాడటం సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయటం, రెడ్యూస్, రీ- యూస్ రీసైకిల్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు, భూగర్భ డ్రైనేజీ కార్మికులకు పిపిఈ కిట్లు అందజేసి, అక్కడున్న గోడపై విద్యార్థినీ విద్యార్థులతో కలిసి పెయింట్ వేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాసన్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *