Breaking News

బొమ్మూరు లో స్పందన…

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
ది.30.05.2022న కలెక్టరేట్ ( బొమ్మూరు) లో ప్రజల నుంచి వినతులు స్వీకరించే స్పందన కార్యక్రమాన్ని ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవి లత ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు ఉదయం 10 గంటల నుంచి మ.1 గంటవరకు వారి ఫిర్యాదులను అందించవచ్చునని ఆమె తెలిపారు. రెవెన్యూ, మండల, మునిసిపల్ కార్యాలయాల్లో, సచివాలయాలలో కూడా ప్రజలు వారి ఫిర్యాదులను ఇవ్వవొచ్చునని కలెక్టర్ తెలియచేశారు. కావున జిల్లా అధికారులు అందరూ స్పందనకు హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయానికి ఎప్పటిలాగే చేరుకోవడానికి ప్రజలకు ఉచిత బస్సులను ఏర్పాటు చేయాలని జిల్లా రవాణా అధికారి( ఆర్టీసి) వారికి ఆదేశాలు జారీ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *