విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా ప్రజలకు సత్వరం మెరుగైన వైద్య, ఆరోగ్య శాఖ సేవలు అందాలని ఎంతోకృత నిశ్చయముగా రాష్ట్రంలో 560 సెంటర్ లు ప్రారంభించి దానిలో అర్హులైన సిబ్బందిని నియమించి, దాని ద్వారా సేవలు అందించేందుకుగత 14 సంవత్సరాల క్రితం వాచ్ మెన్ విధుల్లో చేరిన వారిని యు పి హెచ్ సి ల్లో లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ గా నామకరణం తో కొనసాగిస్తూనే ఉన్నారని, దానివల్ల అన్ని పనులు వారి చేయవలసి వస్తుందని అది ఇబ్బందికరమైన పరిస్థితి అని ఈ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ (20 డిజిగ్నేషన్.అంటే యం.యన్.ఓ/ ఎఫ్ ఎన్ ఓ, ఆటెండర్,ఆఫీసు సబార్డినేట్..) అనే డిజిగ్నేషన్ తో ఉంటే వారికి కేటాయించిన విధులు చేయవచ్చని డిజిగ్నేషన్ లేనందున అన్ని పనులు చేయలేక ఇబ్బందులకు గురవుతున్నారని కాబట్టి వీరికి డిజిగ్నేషన్ వెంటనే ఇవ్వాలని వీరందరూ అర్హులైన వారని గత 2022 పి.ఆర్.సి.లో పెంచిన జీతాలు వీరికి ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వినుకొండ రాజారావు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళతానని తెలియజేశారు. నేడు ఒంగోలులో సంఘ కార్యాలయంలో ఎల్.జి.ఎస్ లో పనిచేస్తున్న ఉద్యోగులు వినుకొండ రాజారావు కి వినతి పత్రం సమర్పించి మా సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపాలని,వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు యం.డి హజీరాబేగం, వి.పద్మావతమ్మా, డి.రసూల్ బి.విజయ్ కుమార్, మాకినేని మురళి, యల్.జి.యస్.ఉద్యోగ సంఘ నాయకులు యం.జాన్ విక్టర్, యం.శ్రీనివాసరావు, పి.గోపి,టి.తిరుపతయ్య, యన్.ప్రవీణ్, రమణయ్య, ఏ.రమేష్ బాబు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News