– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ పోస్టర్ ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో ‘మా నమ్మకం నువ్వే జగన్’ అన్నది ప్రజల నినాదంగా మారిపోయిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని గాయత్రీ కన్వెన్షన్ సెంటర్ నందు ‘జగనన్నే మా భవిష్యత్తు’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం మల్లాది విష్ణు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతుశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ప్రజలతో మమేకమయ్యే భారీ కార్యక్రమానికి ఈనెల 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ కారం చుట్టారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. పార్టీ తరపున సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో కలిసి 14 రోజుల పాటు పకడ్బందీగా కార్యక్రమం చేపట్టనున్నట్లు.. రాష్ట్రంలోని 1.60 కోట్ల కుటుంబాలను 7 లక్షల మంది పార్టీ శ్రేణులు కలవనున్నట్లు వివరించారు. ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి.. సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును ప్రతి గడపకు తెలియజేయడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచేందుకు.. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా అక్షరాలా రూ. 2,96,149 కోట్ల మేర నాలుగేళ్ళలో లబ్ధి చేకూర్చినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. విద్య, వైద్య, గృహ నిర్మాణ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ఇంత చేస్తున్నా ఏదో రకంగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే కార్యక్రమాలు ప్రతిపక్షాలు చేస్తున్నాయని.. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత 45 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సుపరిపాలనను క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వివరించాలన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 96 సచివాలయాల పరిధిలో 1,400 క్లస్టర్లు ఉండగా.. 3 వేల మంది గృహ సారథులు, 300 మంది కన్వీనర్లు ఉన్నట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. వీరంతా గత ప్రభుత్వానికి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య గల వ్యత్యాసాన్ని ప్రజలకు సవివరంగా వివరించాలన్నారు. అలాగే, ప్రభుత్వం పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని, వారి సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కన్వీనర్లు, గృహ సారథులు ముందుకు సాగాలన్నారు. లబ్ధిదారుల అనుమతితో మొబైల్ ఫోన్ తో పాటు ఇంటి డోర్ కు స్టిక్కర్ ను అతికించే కార్యక్రమం చేపట్టాలని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేక, ప్రతిపక్షాలన్నీ ఏకమై వచ్చినా మన టార్గెట్ ‘వైనాట్ 175′ అని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు శర్వాణీ మూర్తి, బాలి గోవింద్, ఎండి షాహినా సుల్తానా, అలంపూరు విజయలక్ష్మి, కొండాయిగుంట మల్లేశ్వరి, ఇసరపు దేవి, ఉద్ధంటి సునీత, కుక్కల అనిత, పెనుమత్స శిరీష, బంకా శకుంతల, జానారెడ్డి, నాయకులు ఆత్మకూరు సురేష్, గుండె సుందర్ పాల్, కనపర్తి కొండా, దోనేపూడి శ్రీనివాస్, అఫ్రోజ్, కాళ్ల ఆదినారాయణ, హఫీజుల్లా, కోలా నాగాంజనేయులు, బత్తుల దుర్గారావు, అలంపూరు విజయ్, ఉద్ధంటి సురేష్, కుక్కల రమేష్, బెజ్జం రవి, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News