గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం రాష్ట్ర పురపాలక , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ స్వచ్చ ఆంధ్ర దివాస్ కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి నెల మూడవ శనివారం జిల్లాల్లో స్వఛ్చ ఆంధ్ర దివాస్ పేరుతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వఛ్చత కార్యక్రమాలను జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, స్వఛ్చత పై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేస్తూ ఉత్తమ విధానాలు అమలుపై ప్రతి నెల స్వఛ్చ ఆంధ్ర దివాస్ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. స్వఛ్చ అంధ్ర దివాస్ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్లు అత్యదిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ సైంటిఫిక్ మరియు సిస్టమాటిక్ గా నిర్వహించాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, జిల్లా పరిషత్ సీఈఓ జ్యోతిబసు, జిల్లా పంచాయితీ అధికారి సాయికుమార్, ఆర్ అండ్ డబ్య్లుఎస్ ఎస్ఈ కళ్యాణ చక్రవర్తి , నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ ఓబులేసు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
పియం ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం పోస్టర్ ఆవిష్కరన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పియం ఇంటర్న్ షిప్ ప్రోగ్రాంపై …