అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇస్రో ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఆలిండియా 9 ర్యాంకు సాధించి సైంటిస్ట్‌గా ఎంపికైన తెలుగు యువకుడు జడగం రమేష్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గురువారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రమేష్ తండ్రి శ్రీనివాసులు డ్రైవర్‌గా, తల్లి రామలక్ష్మి టైలర్‌గా పనిచేస్తూ కష్టపడి చదివించారని తెలుసుకున్న ముఖ్యమంత్రి వారిని అభినందించారు. చంద్రయాన్-3 ల్యాండర్ మిషన్ టీమ్‌లో ఒకరిగా పనిచేసిన రమేష్, భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News