Breaking News

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు -2025

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం కలక్టరేట్ లోని వీసీ హాల్ నందు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు -2025 కు సంబంధించి రూపొందించిన బ్రోచర్‌లు, కరపత్రాలు మరియు బ్యానర్‌లను జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. రహదారి భద్రతపై వాహనదారులు , స్టేక్ హోల్డర్స్ కు అవగాహన కల్పించాలని ఉప రవాణా కమిషనర్ సీతారామి రెడ్డి కి జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ షేక్. ఖజావలి , డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, ఆర్డిఓ శ్రీనివాస రావు, జెడ్పి సిఇఓ జ్యోతిబసు, పీడీ డీఆర్డీఏ , విజయలక్ష్మీ , పీడీ డ్వామా శంకర్ , పీడీ హౌసింగ్ ప్రసాద్, సిపిఓ శేషశ్రీ , డిఈఓ రేణుక , డిఎస్ ఓ కోమలి పద్మ, జిల్లా పౌర సరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ లక్ష్మీ , జీయంసీ అదనపు కమిషనర్ ఓబులేశు, డీడీ మైన్స్ అండ్ జియాలజీ డి. శ్రీ వెంకట సాయి , గ్రౌండ్ వాటర్ డీడీ వందనం, జిల్లా కో ఆపరేటివ్ అధికారి వీరాచారి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *