అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై విచారణకు అథారిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ అథారిటీ కి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా నేతృత్వం వహించనుండగా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాను ప్రెజెంటింగ్ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సాధ్యమైనంత త్వరగా సునీల్ కుమార్‌పై ఉన్న అభియోగాలపై నివేదిక ఇవ్వాలని అధారిటీని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Tags amaravathi
Check Also
పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…
-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …