-యువతలో నైపుణ్యాభివృద్ధికి.. పీఎం ఇంటర్న్షిప్ పథకం
-కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో దేశంలోని టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు నైపుణ్యం తో కూడిన ఉద్యోగవకాశాలు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ ప్రారంభమైందని, వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేశారు.
శనివారం కలెక్టరు ఛాంబర్ లో ” పీఎం ఇంటర్న్షిప్ పథకం ” గోడ ప్రతులను జిల్లా పరిశ్రమల అధికారి శ్రీవనిదర్ రామన్, సహాయ సంచాలకులు ప్రదీప్ కుమార్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎమ్. పెరుమాళ్ళ రావు లతో కలిసి కలెక్టరు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యపరమైన శిక్షణతో కూడిన విద్యను 12 నెలలు పారిశ్రామిక అనుభవం అందించాలని సంకల్పించినట్లు తెలియ చేశారు..20 కంటే ఎక్కువ రంగాలలో యువతకు పీఎం ఇంటర్న్షిప్ పథకం ద్వారా అవకాశాలు ఉన్నాయన్నారు. పీఎం ఇంటర్న్‌షిప్ చేయాలనుకునే వారికి దేశవ్యాప్తంగా అవకాశాలు ఉంటాయన్నారు.
విద్యార్హతలను అనుసరించి పీఎం ఇంటర్న్షిప్ పథకం అర్హత సాధించడానికి, దరఖాస్తుదారులు తమ ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి ఉండాలి. ITI నుండి సర్టిఫికేట్, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా లేదా BA, BSc, BCom, BCA, BBA, BPharm, B.Tech వంటి డిగ్రీని కలిగి ఉండాలి. ఆన్లైన్ లేదా దూరవిద్య ప్రోగ్రామ్లలో నమోదు చేసుకున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు.
భారత ప్రభుత్వం ద్వారా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద చేరే ప్రతీ ఒక్కరికీ బీమా కవరేజీ అందిస్తుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ క్రింది లింక్ లో నమోదు చేసుకోవాలి అని కోరారు. https://pminternship.mca.gov.in/ వెబ్సైట్ ద్వారా ఈ పీఎం ఇంటర్న్షిప్ పథకం కోసం ఆధార్, బయోడేటాతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని, ఎంపికైన వారికి 12 నెలలపాటు రూ.5 వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తారని, ఏకకాల గ్రాంటు కింద రూ.6 వేలు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.
పీఎం ఇంటర్న్షిప్ పథకం జనవరి 10వ తేదీన ప్రారంభమైందని, జనవరి 21వ తేది ఆఖరు తేది అని తెలిపారు. 21-24 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులే ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు అని, కావున తూర్పు గోదావరి జిల్లా యువత ఈ సదవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీమతి పి. ప్రశాంతి తెలిపారు.
మరిన్ని వివరాల కొరకు 9948995678, 7396740041 నంబర్లను సంప్రదించగలరు.