రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
2025 జనవరి 22 న మెయిన్స్ పరీక్షల నిర్వహణను అత్యంత పకడ్బందీగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. బుధవారం ఉదయం జె ఈ ఈ మెయిన్ -2025 పరీక్షలు వేదిక పేరు ION డిజిటల్ జోన్ IDZ లూథర్‌గిరి, రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, లూథర్‌గిరి, రాజమహేంద్రవరం ను కలెక్టర్ సందర్శించడం జరిగింది. జె ఈ ఈ మెయిన్స్ పరీక్ష లకి హాజరయ్యే అభ్యర్థులు 22-01-2025 షిఫ్ట్-1: 890 మంది కి గాను 883 మంది హాజరు కాగా 7 గైరాజరు అయ్యారు. షిఫ్ట్ 2 కి 884 కి గాను 878 హజరు కాగా 6 గైరాజరు అయినట్లు తెలియ చేశారు.
జె ఈ ఈ మెయిన్స్ పరీక్ష సమయాలు: మొదటి షిఫ్ట్ ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకూ , రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 03.00 నుండి సాయంత్రం 06.00 వరకు నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఉదయం షిఫ్ట్ నకు ఉదయం 7.00 నుంచి 8.30 వరకూ, మధ్యాహ్నాం షిఫ్ట్ నకు మ.1.00 గంట నుంచి మ.2.30 వరకు అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఏటువంటి ఎలక్ట్రానిక్ గడ్జెట్స్, వస్తువులను అనుమతించడం జరగదన్నారు. పరీక్షా కేంద్రం ఆవరణలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. 23-01-2025 షిఫ్ట్-1 కి 886 , షిఫ్ట్ 2 కి 884 , 24-01-2025 షిఫ్ట్- 1 :కి 885 , షిఫ్ట్ 2 కి 886 మంది విద్యార్ధులు హాజరు కానున్నట్లు తెలిపారు.