Breaking News

సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి అప్పుడే సమాజంలోని అసమానతలు తొలగుతాయి

-రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పధకాలు ప్రతి పేదవానికి అందినప్పుడే సమాజంలోని అసమానతలు పూర్తిగా తొలగుతాయని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు అన్నారు.76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూష్పాంజలి ఘటించి ఘనంగా నివాళురు అర్పించారు.అనంతరం మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించిన పిదప ఆయన మాట్లాడుతూ గణంతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.1947లో దేశానికి స్వాతంత్ర్యం రాగా 1950 జనవరి 26న మన దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిందని రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 వసంతాలు పూర్తయినా సమాజంలో ఇంకా అసమానతలు తొలగి పోలేదని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేదలందరికీ సమక్రంగా అందిననాడే సమాజంలో అసమాతనలు పూర్తిగా రూపు మాపుతాయని ఆదిశగా ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు.
ప్రపంచంలోనే మన భారత రాజ్యాంగం ఒక ఉత్తమ రాజ్యాంగంగా నిలిచిందంటే అందుకు కారణం మన రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందు చూపుతో అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుని గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించడమేనని చైర్మన్ మోషేన్ రాజు పేర్కొన్నారు. ఆనాడు దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించేందుకు అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు వారి ప్రాణాలను సహితం ఫణంగా పెట్టారని అలాంటి వారి త్యాగాలను భారతీయులందరూ ఎప్పటికీ మరువ రాదని హితవు పలికారు.ముఖ్యంగా మన రాజ్యాంగంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించారని వాటిని ప్రతి ఒక్కరూ అందుకుని అనుభవించేందుకు అవకాశం కల్పిచాంల్సిన అవసరం ఉందని చెప్పారు.ప్రజలకు కల్పించిన హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెల్సుకోవాలని ఆహక్కులు సాధించేందుకు కృషి చేయాలన్నారు.ముఖ్యంగా విద్య,ఆరోగ్యం ద్వారా సమాజం అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందని శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఎస్.ప్రసన్న కుమార్, ఉప కార్యదర్శులు రాజ్ కుమార్,సుబ్బారెడ్డి,ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *