Breaking News

నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు స్త్రీనిధి ద్వారా పెద్ద ఎత్తున్న రుణాలు ఇవ్వాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన వెనుకబడిన వర్గాలకు స్త్రీనిధి ద్వారా పెద్ద ఎత్తున్న రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం స్త్రీనిధి విభాగం విస్తరణకు సిద్దం కావాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. బుధవారం విజయవాడలోని ప్రముఖ హోటల్ లో జరిగిన స్త్రీనిధి వర్క్ షాప్ మరియు సిబ్బంది సమీక్ష సమావేశాన్ని మంత్రి ప్రారంభించారు. స్త్రీనిధి సంస్థ ద్వారా పేద ప్రజలకు రాబోయే రోజులలో రుణాల పంపిణీ మొత్తాన్ని పెంచుతామని తెలిపారు. పొదుపు సంఘాలలో నిరుపయోగంగా ఉన్న నిధులను స్త్రీనిధిలో డిపాజిట్ చేసి మహిళలకు పెద్దమొత్తంలో రుణాలను అందించేందుకు వెలుగు 2.o భాగంగా ముందుకు సాగాలని మంత్రి సూచించారు.
సెర్ప్ సిఈఓ వాకాటి కరుణ మాట్లాడుతూ స్త్రీనిధి సంస్థకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఆర్ధిక క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ సెర్ప్ ,స్త్రీనిధి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్త్రీనిధి మేనేజింగ్ డైరక్టర్ జివిబిడి హరిప్రసాద్ స్త్రీనిధి రుణాల పంపిణీ, రికవరీ, నిరర్థక రుణాల (యన్ పి ఏల) వసూలుపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు డిజియంలు,పదహారు జిల్లాల ఎజియంలు,మేనేజర్లు,అసిస్టెంట్ మేనేజర్లు,కేంద్ర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *