-మిర్చికి గిట్టుబాటు ధరల గురించి మరియు వైరస్ తో ఎండిన మిర్చి పంటకు నష్టపరిహారం గురించి తక్షణమే రైతులకు అద్దే విధంగా చూడాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ కలెక్టర్ కార్యాలయం నందు ఈరోజు మిర్చి రైతులు పడుతున్న సమస్యల గురించి మిర్చికి కనీస గిట్టుబాటు ధర క్వింటాకు 20,000 మరియు వైరస్ తోటిన పంటకి నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా అందజేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశగారికి వినతి పత్రం ద్వారా నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు.
వినతి పత్రం ద్వారా వివరణ
జగ్గయ్యపేట నియోజకవర్గంలో అత్యధికంగా 10 వేల ఎకరాలకు పైగా మిర్చి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఏటా మిర్చి పెట్టుబడి అనూహ్యంగా పెరగటం ఈ సంవత్సరం రకరకాల కారణాల చేత దిగుబడి తగ్గటం వలన రైతులు ప్రస్తుతం మిర్చి 10 నుండి 12 వేల లోపు ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి రావటం చేత మిర్చి రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.
ఇదిలా ఉంటే ఈ సంవత్సరం తాలు ఎక్కువగా రావటం కూడా రైతులకు శాపం అయింది. ఎకారానికి మిర్చికి కనీస పెట్టుబడి రూ.2,00,000/- అవుతున్నందున దిగుబడి 15 నుంచి 20 క్వింటాళ్ళు వస్తున్నందున రైతులకు ఎకరానికి ఒక లక్ష నష్టం వస్తుంది.
అందువలన రైతులను ఆదుకోవటానికి మిర్చి కనీసం గిట్టుబాటు ధర క్వింటాకు రూ.20,000/- కల్పించి ప్రభుత్వం మార్కెఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలని రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.
ఒకవైపు గిట్టుబాటు ధరలు లేక రైతులు దిక్కుచోచని స్థితిలో ఉండగా మరోవైపు జనవరి మొదటి వారం నుండి మిర్చి పంటకు వేరు కుళ్ళు తెగులు ( విల్ట్) వచ్చి ఎకరాలెకరాలు ఎండిపోతున్నాయి. 90% పెట్టుబడి పెట్టి పంట చేతికి వస్తున్న తరుణంలో మిర్చి ఎండిపోతున్న నేపధ్యంలో రైతులు తీవ్ర మనోవేధనకు గురి అవుతున్నారు. కావున రైతులను యూనిట్గా తీసుకొని వైరస్ ద్వారా పంట నష్టపోయిన రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ కనీసం ఎకరానికి రూ.50,000/-ప్రభుత్వం ద్వారా ఇప్చించ వలసినదిగా కోరుచున్నాము.
మిర్చి కనీసం క్వింటాకు రూ.20,000/- గిట్టుబాటు ధర మరియు వైరస్ ద్వారా ఎండిపోయిన మిర్చి పంటకు ఎకరానికి రూ.50,000/నష్టపరిహారం ( క్రాప్ ఇన్సూరెన్స్ ) ఇవ్వాలని కోరుచున్నాము. ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేసి ఈ ప్రాంత మిర్చి రైతులను ఆదుకోవలసినదిగా కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీ సంఘాల అధ్యక్షులు మార్క్ పుడి గాంధీ, జగ్గయ్యపేట మాజీ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, గొట్టిపాళ్ళ సురేష్ గార్లు పాల్గొన్నారు.