విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్రాందీ షాపుల కేటాయింపు విషయంలో కల్లుగీత కార్మికుల విభజించడం సరికాదని, అఖిల భారత గౌడ సంఘం చైర్మన్ శివ నాగేశ్వరరావు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఒక వినతిపత్రం ద్వారా తెలియజేశామని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. కల్లు గీత కార్మిక కుటుంబాలు అందరూ గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశైన, యాత, కలాల్, కలారి 16వ నెంబర్ జీవో ప్రకారం అందరూ సమానమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1998 సంవత్సరం గౌడకులంగా నామకరణం చేయడం జరిగిందని, అందువలన ప్రతి వ్యక్తి కూడా జీవో నెంబర్ 16 ప్రకారం ప్రభుత్వం వారు బ్రాందీ షాపులు కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా గాని వారికి అర్హత ఉన్నది కాబట్టి, ఈ యొక్క జీవోని అమలు పరచాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేయగలరని, గౌడ జాతిఐక్యతను విడదీయవద్దని తెలియజేశారు. బ్రాందీ షాపుల వాటా అడిగితే కల్లుగీత కార్మిక కుటుంబాలను విభజించి పాలించడం తెలుగుదేశం పార్టీకి వెన్నతో పెట్టిన విద్యగా మారిందని, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గౌడలు పట్ల ఏదో ఒక సమస్య సృష్టిస్తూనే ఉందని, గతంలో ఆంధ్రప్రదేశ్‌లో అసలు గౌడలే లేరని ప్రకటించి గౌడ్ కార్పొరేషన్ శెట్టిబలిజ కార్పొరేషన్‌గా మార్చి వివాదాన్ని సృష్టించిందని అన్నారు. ఎన్నికల ఓట్ల కోసం గౌడలకు 20% మద్యం దుకాణాల్లో వాటా ఇవ్వాలని, గౌడలకు షాపుల్లో ఇచ్చిన 10% వాటా విషయంలో కూడా వివాదమే వచ్చిందని గౌడలకు ఉప కులాలుగా ఉన్న నాలుగు ఈడిగా, శెట్టిబలిజ, శ్రీశైన, యాత కులాలకు కొత్త పేర్లను పెట్టి 10 కులాలుగా మార్చి గౌడ జాతి విచ్ఛిన్నానికి కుట్ర చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుందని గీతకల్లు గీత కార్మికులు బ్రాందీ షాపు లైసెన్సులు ఇప్పించాలని ఆయన గీత కార్మికులకు న్యాయ జరిగేటట్టు చూడాలని కోరామని ఆయన ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
Tags vijayawada
Check Also
మంత్రి గొట్టిపాటి అధ్యక్షతన ఐదు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం
-డిస్కంలను లాభాల బాట పట్టించే అంశాలపై మంత్రుల చర్చ -బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీని వెయ్యి నుంచి రెండు వేల మెగావాట్లు …