Breaking News

చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బాపట్ల జిల్లా ఇన్చార్జి మంత్రి సమాచార పౌర సంబంధాల శాఖ మరియు గృహ నిర్మాణాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

చీరాల నియోజకవర్గంలోని దేవాంగపురి గ్రామపంచాయతీలో గ్రామీణ అభివృద్ధి సంస్థ మరియు పంచాయితీ రాజ్ సంయుక్తంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీం క్రింద రూ.47.50 లక్షలతో నిర్మించిన 8 సిమెంట్ రోడ్లను జిల్లా ఇన్చార్జి మంత్రి మంగళవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చీరాల ఒక చారిత్రాత్మక ప్రాంతం అన్నారు. చీరాలలో చేనేతలతో పాటు ఒక గొప్ప వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడు కోటయ్య ఉన్నారన్నారు. ఆయన సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి అని అన్నారు. ఆయన నిరాడంబరతో అట్టడుగు స్థాయి వారిని ప్రేమించే వ్యక్తిత్వం ఉందన్నారు. రాజకీయ నాయకులంతా ఆయనను చూసి నేర్చుకోవాలన్నారు. చేనేత కార్మికుల కోసం అహర్నిశలు కష్ట పడ్డారన్నారు. ఆయన పేరు మీద కేంద్ర ప్రభుత్వం ప్రకటకోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ ప్రారంభించింది అన్నారు. గడ్డం కోటయ్య సామాజిక స్ఫూర్తి, సామాజిక న్యాయం కోసం పాటుపడ్డారన్నారు. అలాంటి వ్యక్తులు పుట్టిన గడ్డపై నుంచి మాట్లాడటం చాలా గర్వంగా ఉందన్నారు. చేనేత కార్మికులు ప్రపంచ దేశాలలో మన దేశ ప్రతిష్టను ఇనుముడింప చేశారని అన్నారు. చేనేత కార్మికులు గొప్పవారన్నారు. చేనేత కార్మికులు ప్రస్తుత స్థితిలో చాలా ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం చేస్తామని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లా వ్యాప్తంగా గత ఐదు నెలల్లో 868 సీసీ రోడ్లను 157 కిలోమీటర్లు మంజూరు చేశామన్నారు. ఆ పనుల మొత్తం అంచనా రూ.91 కోట్లను తెలిపారు. వీటన్నింటిలో సుమారు 70 శాతం రోడ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో 8 రోడ్లను ప్రారంభించామన్నారు. ఈ నియోజకవర్గానికి 96 సీసీ రోడ్లు సుమారు 10 కిలోమీటర్ల పొడవులో మంజూరు చేశామన్నారు. రూ.ఐదు కోట్లకు పైగా ఈ నియోజకవర్గానికి నిధులు వచ్చాయన్నారు. ఈ నియోజకవర్గానికి ఇంకా నిధులు కావాల్సి ఉన్నదని, వాటిని మంజూరు చేయుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేవాంగపురం పంచాయతీలో 11 సీసీ రోడ్లు మంజూరు చేశామని, వాటికి రూ.57 లక్షలు ఖర్చు పెట్టామన్నారు. చీరాల నియోజక వర్గం, పట్టణంలో సిసి రోడ్లు సైడ్ కాలువలకు అదనపు నిధుల కింద రూ.55 లక్షలు మంజూరు చేశామన్నారు. చీరాల నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని జిల్లా ఇన్చార్జి మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి మాట్లాడుతూ చీరాల సముద్ర తీర ప్రాంతంగా ఉన్నప్పటికీ కరువు పీడత ప్రాంతమన్నారు. సరైన వ్యవసాయ సౌకర్యాలు లేవన్నారు. నీటిపారుదల లేదని అన్నారు. ఈ ప్రాంతంలో ఉపాధి అనేది పెద్ద సమస్య అని తెలిపారు. ఇక్కడ చేనేత వృత్తి కలిగిన కుటుంబాలు, సముద్ర చేపలు వేటపై ఆధారపడి కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఓడరేవు విషయంలో సమీక్ష నిర్వహించామన్నారు. ఓడరేవు పనులను మారి టైమ్ బోర్డు నిర్వహిస్తున్నారన్నారు. ఆ పనులు పూర్తయితే మత్స్యకారులకు పెద్ద ఎత్తున సహాయం జరుగుతుందన్నారు. సముద్రం నుండి తీసుకువచ్చిన మత్స్య సంపద రవాణాకు చాలా ఉపయోగపడుతుందన్నారు. ఆదాయం వనరుగా మారుతుందన్నారు. జిల్లాలో యానాదులకు ఆధార్ కార్డులు లేవని, ఆధార్ కార్డు లేకపోతే పథకాలు రావన్నారు. దీనిని గుర్తించి వారికి మేలు చేయాలని లక్ష్యంగా 4000 కుటుంబాలకు ఆధార్ కార్డు ఇచ్చామన్నారు. వారికి అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లింక్ చేశామన్నారు. జిల్లా అభివృద్ధిపై సమీక్ష చేసుకొని ముందుకు వెళ్తామని తెలిపారు.

చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ బాపట్ల నియోజకవర్గానికి ఎన్ఆర్ జి ఎస్ మొదటి విడత కింద రూ.4.80 కోట్లు, రెండో విడత కింద రూ.కోటి మూడు లక్షలు మంజూరు చేశామన్నారు. ఓడరేవు నుంచి పొట్టి సుబ్బయ్య పాలెం వరకు ఒక డబుల్ రోడ్డు మంజూరు కాగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. బోయినపాలెం నుంచి 9 కిలోమీటర్ల వరకు ఇంకొక రోడ్డు మంజూరు చేశారన్నారు. నేషనల్ హైవే-216 నుంచి పందిళ్ళపల్లి కి కనెక్టివిటీ రోడ్లు, ఈపురుపాలెం నుంచి కనెక్టివిటీ రోడ్లు మంజూరు అయ్యాయన్నారు. వీటికి మొత్తం రూ.50 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. చీరాలకు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయించాలని మంత్రిని కోరారు. చేనేతను దృష్టిలో పెట్టుకొని హ్యాండ్లూమ్ పార్కును ప్రభుత్వం ఇచ్చిందన్నారు. త్వరలో కార్యరూపం దాలుస్తుందని అన్నారు. చీరాల ప్రజలకు ఉపాధి లేదన్నారు. ఇక్కడ కేవలం ఐటిసి ద్వారా మాత్రమే కొంతమేర ఉపాధి కలుగుతుందని తెలిపారు. చీరాలలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. చీరాలకు ఫిషింగ్ హార్బర్, హ్యాండ్లూమ్ పార్క్, టూరిజం వస్తే ఉపాధి కల్పన జరుగుతుందని, ఆర్థిక వనరులు వచ్చేలా ఇన్చార్జి మంత్రి కృషి చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ, డ్వామా పిడి జయలక్ష్మి, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ సజ్జల హేమలత, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *