అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేయాగా సియం చంద్రబాబు నేత్త్వంలోని కూటమి ప్రభుత్వం మరలా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు పెద్దఎత్తున కృషి చేయడం జరుగుతోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,గృహ నిర్మాణ శాఖామాత్యలు కొలుసు పార్ధసారధి వెల్లడించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడూ రాష్ట్రాభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకు వెళ్ళేందుకు గత ఏడు నెలల్లో రాష్ట్రానికి 6.33 లక్షల కోట్ల రూ.ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఎంఓయులు కుదుర్చుకోవడం జరిగిందని తద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని తెలిపారు. ముఖ్యంగా విశాఖలో టిసిఎస్,ఎన్ టి పి సి,ఆర్సిలర్ మిట్టల్ ఎన్ హెచ్ పి సి రిలయన్స్ వంటి కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నాయని చెప్పారు.గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను తెల్సుకోకుండా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై నీతిఆయోగ్ ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇస్తే దానిపై విమర్శలు చేయడం సరికాదని ఖండించారు.ఒక వ్యక్తి మూర్ఖత్వ పాలనతో ఏరాష్ట్రమైనా దేశమైనా ఏవిధంగా నష్టపోతుందనేకు గత ప్రభుత్వ పాలనే నిదర్శనమని పేర్కొన్నారు. అంతేగాక రాష్ట్రానికి ఆదాయాన్న పెంపొందించాల్సిన వారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతి పాలు చేసి సుమారు 10 లక్షల కోట్ల రూ.ల అప్పుల ఊబిలోకి నెట్టేసారని మంత్రి పార్ధసారధి అన్నారు.
గత ప్రభుత్వం విద్యార్ధుల ఫీజు రీఇంబర్సుమెంట్ కు సంబంధించి రూ.2800 కోట్లు, అంగన్ వాడీల్లో చిన్న పిలల్లకు అందించే చిక్కీలు,గ్రుడ్లుకు సంబంధించి రూ.1700 కోట్లు, ఉద్యోగులకు సంబంధించి రూ.20వేల కోట్లు బకాయిలు చెల్లించలేదని వివరించారు.అదే విధంగా గృహ నిర్మాణానికి సంబంధించి రూ.7వేల 800 కోట్లు,ఉపాధి హామి పధకానికి రూ.2100 కోట్లు బకాయిలు పెట్టివెళ్ళిందన్నారు.అంతేగాక ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా పెద్దఎత్తున బకాయిలు చెల్లించలేదని తెలిపారు.రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా సకాలంలో సొమ్ము చెల్లించ లేదని చెప్పారు.
గత ప్రభుత్వ హాయంలో వ్యవసాయ రంగం మొత్తం కుదేలైందని,గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులన్నిటీ ఎక్కడికక్కడే నిలిపే వేయడం జరిగిందని మంత్రి పార్దసారధి పేర్కొన్నారు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు జీవనాడైన పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం పూర్తిగా నిర్ణక్ష్యం చేసిందని అన్నారు.ఈకూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చాక పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు రూ.15వేల కోట్లను కేంద్రం నుండి మంజూరు చేయించుకో గలిగామని తెలిపారు.
అమరావతి రాజధాని పనులన్నిటనీ గత ప్రభుత్వం పూర్తిగా ప్రక్కన పెట్టి పూర్తిగా నిర్లక్ష్యం చేయడమేగాక మూడు రాజధానుల పేరిటి నాటకమాడుతూ అసులు రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసిందని మంత్రి పార్ధసారధి పేర్కొన్నారు.కాని ఈకూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన 7 మాసాల్లోనే ప్రపంచ బ్యాంకు,హడ్కో,జైకా తదితర సంస్ధల ద్వారా 31వేల కోట్ల రూ.లను సాధించుకోగలిగామని చెప్పారు.
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మరో పెద్ద హామీ అయినా దీపం పథకం కింద మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం జరుగుతోందని దానివల్ల 90 లక్షల మందికి లబ్ది చేకూరుతోందని మంత్రి తెలిపారు.గడిచిన ఏడు నెలల్లో 7 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించిన దార్శనికుడు చంద్రబాబు నాయుడని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు పూర్తి కాని,మరమ్మత్తులు చేయలేని గ్రామ,పట్టణ, రాష్ట్ర రహదారులను పూర్తి చేసి గుంతలు లేని ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నామని చెప్పారు.
ఓ వైపు అప్పుల కుప్ప, మరో వైపు గత ప్రభుత్వ బకాయిల తట్ట దర్శనమిస్తున్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల మన్ననను పొందుతోంది ఈ ప్రభుతమన్నారు.1000 పెన్షన్‌ను పెంచడానికే జగన్ రెడ్డికి ఐదేళ్లు పట్టింది కానీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన రోజునే రూ.3 వేలు ఉన్న సామాజిక పెన్షన్‌ను రూ.4 వేలు చేశారన్నారు.ఇచ్చిన హామీ మేరకే ప్రతీ నెల ఒకటో తేదీనే ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ జరుగుతోందని తెలిపారు..ప్రతీ ఏటా మెగా డీఎస్సీ ప్రకటిస్తానని హామీ ఇచ్చి ఒక్క ఏటా కూడా డీఎస్సీని పూర్తి చేయకుండా హామీని గాలికి వదిలేశారని కానీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన రోజునే డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీ ఫైళుపై సంతకం చేశారని గుర్తు చేశారు.పేదవానికి అన్నం పెట్టే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం మూసివేస్తే ఈప్రభుత్వం వచ్చిన వెంటనే వాటిని పునరుద్దరించడం జరిగిందని మంత్రి పార్దసారధి చెప్పారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరించకుండా నివారించేందుకు గత ప్రభుత్వం కనీస ప్రయత్నాలు చేయలేదని కాని కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రవేటీకరణ కాకుండా అనేక ప్రయత్నాలు చేయడం జరిగిందని అంతేగాక దానికి రివైవల్ ఫ్యాకేజి కింద కేంద్రం నుండి 11వేల 500 కోట్ల రూ.లను సాధించుకోగలిగామని అన్నారు.అంతేగాక విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే శంఖుస్థాపన జరిగిందని తెలిపారు.
రాష్ట్రంలో ఐదేళ్ళలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా,ప్రతి ఇంటిలో ఒక ఎంటర్ప్రెన్యూర్ ను తీర్చిదిద్దే లక్ష్యంగా ఈకూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పార్ధసారధి స్పష్టం చేశారు.
Tags amaravathi
Check Also
మంత్రి గొట్టిపాటి అధ్యక్షతన ఐదు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం
-డిస్కంలను లాభాల బాట పట్టించే అంశాలపై మంత్రుల చర్చ -బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీని వెయ్యి నుంచి రెండు వేల మెగావాట్లు …