-విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడు అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ఆదివారం ఉదయం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల గర్వించదగిన మహానీయుడు అని కొనియాడారు. ఆయన నిరాహార దీక్షతో స్వతంత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు మార్గదర్శకుడయ్యారు తెలుగు భాషా గౌరవం కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడిన ఆయన త్యాగం చిరస్మరణీయమన్నారు. పొట్టి శ్రీరాములు ఆశయాలను అనుసరిస్తూ, ప్రజలకు సేవ చేయడమే నిజమైన నివాళి అని మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడిచి, అభివృద్ధి పరమైన కార్యక్రమాలను విజయవాడ నగరపాలక సంస్థ చేపడుతుందని తెలిపారు.
Prajavartha Online Telugu News