Breaking News

అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడు

-విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడు అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ఆదివారం ఉదయం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల గర్వించదగిన మహానీయుడు అని కొనియాడారు. ఆయన నిరాహార దీక్షతో స్వతంత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు మార్గదర్శకుడయ్యారు తెలుగు భాషా గౌరవం కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడిన ఆయన త్యాగం చిరస్మరణీయమన్నారు. పొట్టి శ్రీరాములు ఆశయాలను అనుసరిస్తూ, ప్రజలకు సేవ చేయడమే నిజమైన నివాళి అని మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడిచి, అభివృద్ధి పరమైన కార్యక్రమాలను విజయవాడ నగరపాలక సంస్థ చేపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి సత్యకుమారి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపి నాయక్, మేనేజర్ ఎయుబి శర్మ, సిబ్బంది పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.
అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *