-కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ వెల్లడి
-కమ్యూనిటీ రేడియో స్టేషన్స్ పై కేంద్ర సమాచార ప్రసార శాఖను ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ వ్యాప్తంగా కమ్యూనిటీ రేడియోలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుందని, 2025లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5వర్క్‌షాప్‌లను నిర్వహించారు. గత మూడు సంవత్సరాలుగా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ సపోర్టింగ్ కమ్యూనిటీ రేడియో మూవ్‌మెంట్ కింద 2021-22 లో రూ.1.30 కోట్లు, 2022-23 రూ.1.53 కోట్లు, 2023-24 రూ.2.60 కోట్ల నిధులు మొత్తంగా రూ.5.43 కోట్లు విడుదల చేయగా, ఎపిలో ఒక కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించగా రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ వెల్లడించారు.
విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కమ్యూనిటీ రేడియో స్టేషన్స్ కి సంబంధించి దేశంలోని మొత్తం కమ్యూనిటీ రేడియో స్టేషనల సంఖ్య, ఏ పథకం కింద వీటిని ఏర్పాటు చేశారు? గత మూడేళ్లలో ఎపికి మంజూరు చేసిన నిధులతోపాటు , నిర్వహించిన శిక్షణా శిబిరాలు వివరాలు తెలియపర్చాలంటూ లోక్ సభలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను అడిగిన ప్రశ్నకు బుధవారం కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ లిఖిత పూర్వకంగా సమాధానం తెలిపారు.
దేశంలో కమ్యూనిటీ రేడియో స్టేషన్లు 27 మార్చి 2025 నాటికి మొత్తంగా 532 ఏర్పాటు చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 12 కమ్యూనిటీ రెడియో స్టేషన్స్ వున్నాయి.చిత్తూరు లో 3, గుంటూరు లో 2, కడప లో 2, కాకినాడ 1, కర్నూల్ లో 1, శ్రీకాకుళం లో 1, పశ్చిమ గోదావరి లో 2 కమ్యూనిటీ రేడియో స్టేషన్స్ వున్నట్లు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News