Breaking News

స్థాయి సంఘ సమావేశాలు వాయిదా…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జరగవలసిన స్థాయి సంఘ సమావేశాలకు జిల్లాలోని జడ్పిటిసి సభ్యులు ఎవరు హాజరుకానందున సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో కన్నమనాయుడు ప్రకటించారు. శుక్రవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఆయన డిప్యూటీ సీఈఓ ఆనంద్ కుమార్ తో కలసి స్థాయి సంఘ సమావేశాలను ప్రారంభించారు. అయితే ఈ సమావేశాలకు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు హాజరైనప్పటికీ జడ్పిటిసి సభ్యులు ఎవరు హాజరు కాకపోవడంతో షెడ్యూల్లో ప్రకటించిన సమయం ప్రకారం వేచి చూసి ఒక్కొక్క స్థాయి సంఘ సమావేశం వాయిదా వేస్తూ ప్రకటించుకుంటూ వచ్చారు. తొలిగా, రెండవ స్థాయి సంఘ సమావేశం గ్రామీణాభివృద్ధి, మూడవది వ్యవసాయం, నాలుగవది విద్య వైద్యం, ఆరవదిగా స్త్రీ సంక్షేమం, రక్షణ సమావేశ నిర్వహణ కోసం నిరీక్షించి సభ్యులు ఎవరు హాజరు కాకపోవడంతో భోజనం విరామం ప్రకటించారు. విరామం అనంతరం జెడ్పి సీఈవో ఆరవ స్థాయి సంఘ సమావేశం సాంఘిక సంక్షేమంను ప్రారంభించగా పెడన జడ్పిటిసి సభ్యులు అర్జా వెంకట నగేష్ మాత్రమే హాజరయ్యారు. అయితే సమావేశ నిర్వహణకు నిబంధనల ప్రకారం చాలినంత కోరం లేనందున వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి 1వ స్థాయి సంఘ సమావేశం ప్లానింగ్ ఆర్థికం, ఏడవదిగా పనులు స్థాయి సంఘ సమావేశానికి సభ్యులు ఎవరూ హాజరు కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి, తదుపరి సమావేశ తేదీని త్వరలో ప్రకటిస్తామని జెడ్పి సీఈవో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *