-మార్కెట్ ధరల పర్యవేక్షణపై మంత్రుల బృంద సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మార్కెట్ ధరల పర్యవేక్షణపై మంత్రుల బృందం (Group of Ministers – GoM) సమావేశం జూలై 18న జరిగింది. ఈ సమావేశానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత వహించగా, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలపై రోజువారీ సమీక్ష, ఎప్పటికప్పుడు నియంత్రణ చర్యలు. ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయం.*వరిపై మార్కెట్ రుసుమును 2% నుండి 1%*కి తగ్గించే ప్రతిపాదనపై చర్చ. టమాటా ఉత్పత్తి పై బెరిజ వేసుకుంటూ ధరలను నియంత్రణకు చర్యలు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయం. సిబ్బంది కొరత నివారించేందుకు ఇతర శాఖల నుంచి అర్హులైన ఉద్యోగులను శిక్షణతో నియమించాలన్న సూచన.
తూనికలు కొలతల శాఖ & ఫుడ్ సేఫ్టీ విభాగం సంయుక్తంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో ఆహార నాణ్యతపై అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అవగాహన కల్పించి, సన్న రకం ధాన్యం సాగు చేయించేందుకు వ్యవసాయ శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News