Breaking News

దేశవ్యాప్తంగా వికలాంగుల పునరావాస కేంద్రాల‌కు రూ.37 వేల‌ కోట్లకు పైగా నిధులు విడుద‌ల‌

-ఆంధ్రప్రదేశ్‌ కు రూ.3.77 కోట్లు మంజూరు
-కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ,వికలాంగుల సాధికారత శాఖ స‌హాయ మంత్రి బి. ఎల్. వర్మ వెల్ల‌డి
-జిల్లా వికలాంగుల పునరావాస కేంద్ర వివ‌రాలు, నిధుల మంజూరు పై ప్ర‌శ్నించిన ఎంపీలు కేశినేని శివ‌నాథ్ (చిన్ని), లావు శ్రీ కృష్ణ దేవ‌రాయులు, ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద‌రావు

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో ఒక జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం (DDRC) ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల మేరకు మాత్రమే ఈ కేంద్రాలకు నిధులు విడుదలవుతున్నాయి. రాష్ట్రాలు, జిల్లాల వారీగా ముందస్తు కేటాయింపులు లేవని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ,వికలాంగుల సాధికారత శాఖ స‌హాయ మంత్రి బి. ఎల్. వర్మ వెల్ల‌డించారు.

దేశంలోని జిల్లా వికలాంగుల పునరావాస కేంద్ర వివ‌రాలు, నిధుల మంజూరు పై లోక్ స‌భ‌లో మంగ‌ళ‌వారం లావు శ్రీ కృష్ణ దేవ‌రాయులు, ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద‌రావు ల‌తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) , కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ,వికలాంగుల సాధికారత మంత్రిత్వ శాఖ‌ను ప్ర‌శ్నించారు. ఈప్ర‌శ్న‌కు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ,వికలాంగుల సాధికారత శాఖ స‌హాయ మంత్రి బి. ఎల్. వర్మ లిఖిత పూర్వ‌కంగా బదులిచ్చారు.

ప్రతిపాదనలు వచ్చినప్పుడు మాత్ర‌మే జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రాల‌ కు గ్రాంట్-ఇన్-ఎయిడ్ (GIA) రూపంలో నిధులు అందజేయబడతాయని, ఈ విధానంలోనే గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా వికలాంగుల పునరావాస కేంద్రాల‌కు నిధులు అందించబడ్డాయని కేంద్ర మంత్రి బి. ఎల్. వర్మ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 96 జిల్లాలకు కలిపి రూ.37 కోట్లు 77 ల‌క్ష‌ల నిధులు విడుదల చేయ‌గా , గత ఐదేళ్లలో ఏపీకి రూ.3 కోట్ల 77 ల‌క్ష‌లు నిధులు మంజూరైన‌ట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *