-పశ్చిమంలోని ఎంపీ కేశినేని శివనాథ్ క్యాంప్ కార్యాలయంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
-ముఖ్యమంత్రి చంద్రబాబు కి కృతజ్ఞతలు తెలిపిన వెస్ట్ టిడిపి నాయకులు
-ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇస్తాము…రాయితీ అందిస్తామంటూ మోసపూరిత మాటలతో బీసీలను నట్టేట ముంచింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులకు హ్యాండ్ లూంకు 200 యూనిట్లు, పవర్ లూంకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నందుకు రాష్ట్రంలో బిసీలందరూ ఎంతో ఆనందంగా వున్నారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ తెలిపారు.
పశ్చిమ నియోజకవర్గంలోని ఎంపీ కేశినేని శివనాథ్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు నియోజకవర్గ టిడిపి నాయకులు చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్ కు కృతజ్ఞతలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య చైర్మన్ డూండీ రాకేష్ తో పాటు నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల్లోని అన్ని హామీలను ఒక్కోక్కటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడూ సీఎం చంద్రబాబు నాయుడు అండగా వుంటారని తెలిపారు. కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందించడం ద్వారా బడుగు బలహీన వర్గాల వారిని పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు కట్టుబడి ఎన్డీయే కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కుల వృత్తుల్లో వున్న ప్రతి ఒక్కరిని అభివృద్ది చేసేందుకు ఎన్డీయే కూటమి సహకరిస్తుందని, బీసీల అభివృద్దే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళుతున్నారన్నారు. ఎన్డీయే కూటమి అధికారంలో వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహించిన తొలి అడుగు కార్యక్రమంలో ప్రజలకు వున్న సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు.
కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు ఎంపీ క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేతలకు ఉచిత విధ్యుత్ అమలు చేయటం పై హర్షం వ్యక్తం చేశారు.అలాగే ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం చేసేందుకు వీలు స్త్రీ శక్తి పథకం అమలు చేయనున్నారన్నారు..సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలతో పాటు పలు అభివృద్ది , సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమలు జరుగుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజవర్గ మహిళ అధ్యక్షురాలు సుఖాసి సరిత, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సోలంకి రాజు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆశా, డివిజన్ అధ్యక్షులు ఈగల సాంబ, బడుగు వెంకన్న, గంగాధర రెడ్డి, జాహీద్, హజీజ్, పత్తి నాగేశ్వరరావు, చిన్న సుబ్బయ్య, జోగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గోలి శ్రీనివాసరావు , క్లస్టర్ ఇన్చార్జ్ భవానీ ప్రసాద్, క్లస్టర్ ఇన్చార్జ్ ప్రభుదాసు, నాయకులు మైలవరపు దుర్గారావు, టిడిపి మహిళ నాయకులు విజయలక్ష్మీ, మల్లీశ్వరి, టిడిపి నాయకుడు అన్సార్, ఐటిడిపి నాయకులు చైతన్య, గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలా మాధవ లతో పాటు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News