Breaking News

రాజకీయాల్లో ప్రజలు భాగస్వామ్యులు కావడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం… : డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా జనసేన అధినేత, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర రాజకీయ పార్టీల నాయకులు కన్నాజనసేన నాయకులు, కార్యకర్తలు ఆదర్శ వంతంగా పనిచేయాలని, తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ కృషి వల్లే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం కాకుండా నిలబడిందన్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి నాయ్యం జరగాలని కూటమి ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పగించడం శుభ పరిణామమన్నారు. వైసీపీ సుగాలి ప్రీతి ఇష్యూ ని రాజకియంగా వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకియాల్లో మార్పు రావాలని, కొత్తతరం నాయకత్వం ఏర్పాటుకు జనసేన కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో రబ్బరు చెప్పులు వేసుకొనే వారితో రాజకీయం చేస్తానన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నేడు కార్యరూపం దాల్చుతున్నాయన్నారు. రాష్ట్రంలో విజయదశమి నుఁడి కొత్త తరహా రాజకీయ ప్రస్థానం ప్రారంభమవుతుందని తెలిపారు. రాజకీయాలలో యువతను ప్రోత్సహిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తారన్నారు. రాజకీయ వారసత్వంకి జనసేనలొ చోటు లేదని డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ స్పష్టం చేశారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ అలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ గా జనసేన జిల్లా ఉపాధ్యాక్షులు బత్తిన మధుబాబును సిఫార్సు చేశామన్నారు. ఎమ్మెల్యే కూడా తన సమ్మతి తెలుపుతూ సిఫార్సు లేఖను ఇచ్చారని ప్రకటించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *