విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ గుణదల సెంటర్ పడవలరేవు దగ్గర నూతనంగా అత్యాధునిక మిషన్లతో ‘చందు కార్ వాష్’ సెంటర్ ను వై ఎస్ ఆర్ సి పి తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన కార్ వాష్ సెంటర్ దినదిన ప్రవర్థమనమై అభివృద్ధి చెందలని కోరుకుంటూ మిత్రుడు వడ్లమూడి సంపత్, చందు, వేణు కి అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.
ప్రొప్రైటర్ వడ్లముడి సంపత్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చందు చికెన్ సెంటర్, చందు ఫుడ్స్ జోన్, పదిహెను సంవత్సరాల అనుభవంతో వ్యాపారాలని విజయవంతంగా నడిపిస్తున్నామని,నాణ్యత విషయంలో రాజీ ఉండదని మమ్మల్ని ఆదరించిన వినియోగదారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. చందు చారిటీస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు, నూతన యంత్ర పరికరాలతో అత్యాధునికమైన సదుపాయాలతో సర్వాంగ సుందరంగా, పదేళ్ల అనుభవంతో ఈ కారు వాష్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలని కోరుకుంటున్నామన్నారు. ప్రారంభోత్సవానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన వైఎస్ఆర్ సి పి పార్టీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ కు 5వడివిజన్ కార్పొరేటర్ కలపాల అంబేద్కర్, 6వడివిజన్ కార్పొరేటర్ ఆమరనాథ్, 7వ డివిజన్ కార్పొరేటర్ మాధురి, ఇతర వైసీపీ నాయకులుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమానికి అతిథులుగా 5వడివిజన్ కార్పొరేటర్ కలపాల అంబేద్కర్, 6వడివిజన్ కార్పొరేటర్ ఆమరనాథ్, 7వ డివిజన్ కార్పొరేటర్ మాధురి, ఇతర వైసీపీ నాయకులు, శ్రేయోభిలాషులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News