Breaking News

మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు డా.జి.సుబ్రహ్మణ్యం శర్మ సందర్శన

-ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్‌తో ప్రత్యేక భేటీ
-బ్రాహ్మణుల ఆర్థిక, సామాజికాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు, అఖిల భారత బ్రాహ్మణ మహా సంఘం(ABBMS) ఉపాధ్యక్షులు డా.జి.సుబ్రహ్మణ్యం శర్మ ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన బుచ్చి రాంప్రసాద్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణుల సంక్షేమానికి చేస్తున్న కృషి అభినందనీయం అని అన్నారు. గతంలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, అధికారులు కానీ తమకు అపాయింట్‌మెంట్ ఇచ్చేవారు కాదని, రెండు సార్లు అపాయింట్‌మెంట్ ఇచ్చారని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటే రెండు సార్లు కాన్సిల్ చేశారని ఆయని గుర్తు చేశారు. నేడు చైర్మన్‌గా బాధ్యతలు తీసుకోకముందే అఖిల భారత బ్రాహ్మణ మహా సంఘానికి బుచ్చి రాంప్రసాద్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో దేశంలోని బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేయవచ్చని, అందుకు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ తరఫున తమ సహకారాలు కావాలని బుచ్చి రాంప్రసాద్‌ను ఆయన కోరారు. అలానే ఏపీలోని బ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం బుచ్చి రాంప్రసాద్ ని డా.జి.సుబ్రహ్మణ్యం శర్మ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ABBMS జాతీయ ఉపాధ్యక్షులు చక్రవర్తి రమణాచార్య, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్యాం రఘునందన్, రాష్ట్ర అధ్యక్షులు గోవింద శర్మ, ABBMS జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *