Breaking News

అవరోధాల‌ను అవ‌కాశాలుగా మ‌ల్చ‌టం సీఎం చంద్ర‌బాబుకే సాధ్యం

-ఏడాదిన్న‌ర పూర్తయ్యేలోపే సూప‌ర్ సిక్స్ సూప‌ర్ స‌క్సెస్ సాధించింది.
-టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షురాలు గ‌ద్దె అనూరాధ, ఎంపీ కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డి
-ఎన్డీయే కూట‌మి ఏడాదిన్న‌ర పాల‌న పై మీడియా స‌మావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అవరోధాల నుంచి అవకాశాలను వెతుక్కునే వారిలో చంద్రబాబు నాయుడు ముందుంటారు. అలా అవ‌కాశాలు సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ది ప‌ధంలో న‌డిపించ‌టం సీఎం చంద్ర‌బాబు కే సాధ్యమ‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్య‌క్షురాలు గ‌ద్దె అనురాధ అన్నారు.

ఏడాదిన్నర కాలంలో ఎన్డీయే కూట‌మి సాధించిన విజ‌యాల‌పై ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్య‌క్షురాలు గ‌ద్దె అనురాధ, జిల్లా ప్రధాన కార్య‌ద‌ర్శి చెన్నుబోయిన చిట్టిబాబు మంగ‌ళ‌వారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడ‌మీ చైర్మ‌న్ షిబ్లీ, రాష్ట్ర‌ ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్‌ సావల దేవదత్, రాష్ట్ర‌ బిల్డింగ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల. రఘు రామరాజు, రాష్ట్ర‌ నాగవంశం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, రాష్ట్ర సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాల కోటయ్య పాల్గొన్నారు. ఈ స‌మావేశానికి ముందు టిడిపి వ్య‌వ‌స్థాపక అధ్య‌క్షుడు , దివంగ‌త నేత మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు విగ్ర‌హానికి పూల మాల వేసి నివాళుల‌ర్పించారు.

ఈ సంద‌ర్బంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షురాలుగా నియ‌మితులైన గ‌ద్దె అనురాధ‌, ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి చెన్నుబోయిన చిట్టిబాబులకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఏడాదిన్న‌ర పూర్త‌య్యే లోపు సీఎం చంద్ర‌బాబు నాయక‌త్వంలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం సూప‌ర్ 6 ప‌థ‌కాలు సూప‌ర్ హిట్ చేసి చూపింద‌న్నారు. ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం మంచి ప్ర‌భుత్వం, ప్ర‌జా ప్ర‌భుత్వం అనే ప‌ల‌క‌రింపు, అభినంద‌న‌లు ప్ర‌జ‌లు నంచి వ‌స్తున్నాయ‌న్నారు.

త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం ద్వారా 67.27 ల‌క్ష‌ల మంది విద్యార్ధుల‌కు రూ.10, 090 కోట్లు చెల్లించిన‌ట్లు తెలిపారు. స్త్రీ శ‌క్తి ప‌థ‌కం ఆగ‌స్టు 15 నుంచి ప్రారంభించ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు అయిన వ్య‌యం రూ.1.444 కోట్లు కాగా, 3.25 కోట్ల మంది మ‌హిళ‌లు ఉచితంగా ప్ర‌యాణించార‌ని తెలిపారు. దివ్యాంగుల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం…ఎక్క‌డైనా పింఛ‌ను తీసుకునే సౌక‌ర్యం క‌ల్పించ‌టం జ‌రిగంద‌న్నారు. అన్న‌దాత సుఖీ భ‌వ ప‌థ‌కం ద్వారా 46 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ.6.310 కోట్లు రైతుల ఖాతాల జ‌మ చేయ‌టం జ‌రిగింద‌న్నారు. ఇలా పెన్షన్స్ , ఉచిత గ్యాస్ సిలిండర్స్ , ఇమామ్ , మౌజమ్స్, పాస్టర్స్ కి , డ్రైవర్లకు పదిహేనువేలు , గీతకార్మికులకు సహాయం ఇలా ఎన్నో చేసిన‌ట్లు వివ‌రించారు.

ముఖ్య‌మంత్రి తొలి సంత‌కం చేసిన మెగా డీఎస్సీ ద్వారా 15 వేల 941 టీచ‌ర్ల పోస్టుల భ‌ర్తీ అయ్యాయ‌ని, 5,757 కానిస్టేబుల్ పోస్టులు నియ‌మాకం కూడా పూర్తి చేయ‌టం జ‌రిగింద‌న్నారు. అలాగే రాష్ట్రానికి భారీ పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చి దాదాపు ఎనిమిదిలక్షల ఉద్యోగాలు సాధించేలా ముందడుగు వేయ‌టం జ‌రిగింద‌న్నారు.
ముఖ్య‌మంత్రి గా చంద్ర‌బాబు క‌ల‌క‌లంగా వుండాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం హ‌డావుడిగా నిర్ణ‌యాలు తీసుకోద‌ని, జ‌న‌గ‌ణ‌న పూర్తి అయిన త‌ర్వాత గ్రేట‌ర్ విజ‌య‌వాడ పై సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలిపారు. గ్రేటర్ విజయవాడ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని స్ప‌ష్టంచేశారు.

గ‌ద్దె అనురాధ మాట్లాడుతూ గ‌త ప్ర‌భుత్వం విధ్వంసం వైపు రాష్ట్రాన్ని తీసుకువెళ్లితే సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో రాష్ట్రం వికాసం న‌డుస్తుంద‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ది చూసి స‌హించ‌లేక వైకాపా నాయ‌కులు మాట్లాడుతున్నార‌న్నారు.

గ‌త ప్ర‌భుత్వం పేద‌ల‌కు అన్నం పెట్టే అన్న‌క్యాంటీన్లు మూసివేస్తే….ఎన్డీయే కూట‌మి అధికారంలో వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక అన్న‌క్యాంటీన్ ఏర్పాటు చేయ‌టం జ‌రిగింద‌న్నారు. వైకాపా ప్ర‌భుత్వం రాష్ట్ర ఖ‌జ‌నాను ఖాళీ చేసింద‌ని అయినా రాష్ట్రాన్ని అభివృద్దిలో ముందుకు తీసుకువెళ్ల‌టం జ‌రుగుతుంద‌న్నారు. రైతుల‌ను ఏ మాత్రం ఇబ్బంది పెట్ట‌కుండా రాష్ట్ర ప్ర‌భుత్వం పంట‌ను కొనుగోలు చేసి రైతుల ఖాతాలో న‌గ‌దు జ‌మ చేయ‌టం జ‌రుగుతోంద‌న్నారు. రాబోయే సంక్రాంతి రైతుల‌కు నిజ‌మైన సంక్రాంతి పండుగ అని తెలిపారు.

టిడిపి ఎప్పుడు మ‌హిళ‌ల‌కు పెద్ద పీట వేస్తోంద‌న్నారు. ఉచిత బ‌స్సు సౌక‌ర్యంతో మ‌హిళ‌లు ఎంతో ఆనందంగా వున్నార‌న్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆశ్చ‌ర్య‌పడే విధంగా రాష్ట్రానికి గూగుల్ సీఎం చంద్ర‌బాబు తీసుకురావ‌టం జ‌రిగింద‌న్నారు. కూటమి అధికారంలోకి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ కూడా బాగా త‌గ్గింద‌ని, గంజాయి, డ్రగ్స్ ను కూడా అరికట్టడం జరిగిందన్నారు.

కొండ‌ప‌ల్లి మున్సిపాల్ చైర్మ‌న్ , ఎన్టీఆర్ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చెన్నుబోయిన చిట్టిబాబు మాట్లాడుతూ త‌న‌కి ఈ అవ‌కాశం క‌ల్పించిన టిడిపి జాతీయ అధ్యక్షుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాస్, ఎంపీకేశినేని శివ‌నాథ్ ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *