Breaking News

పేరిచర్ల గృహ లే అవుట్ ను పరిశీలించిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పేరిచర్ల గృహ లే అవుట్ ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం పరిశీలించారు. లే అవుట్ లో మొత్తం 18,090 గృహాలు ఉండగా అందులో అర్బన్ కు చెందిన  9,600 గృహాలు ఉన్నాయి. అతి త్వరగా పూర్తి చేయుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. లే అవుట్ లలో అతి పెద్ద లే అవుట్ అని, మంచి లే అవుట్ అని వేలాది లబ్ధిదారులకు ఒకే ప్రదేశంలో  నివసించే అవకాశం అన్నారు. గృహ నిర్మాణాలు వేగవంతం కావడానికి హెవీ వాహనాలు రాకపోకలకు అనుగుణంగా రహదారులు అవసరమై ఉందని లబ్ధిదారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జె.వి.ఎస్.ఆర్.కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *