Breaking News

సర్వసభ్య సమావేశం వాయిదా

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ 2025-26 సంవత్సర సవరణ బడ్జెట్ మరియు 2026-27 సంవత్సరపు అంచనా బడ్జెట్ ఆమోదం కోసం శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రీస్టీనా అధ్యక్షతన  సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, శాసనమండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం, శాసన సభ్యులు డా. బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద బాబు, జడ్పీ సీఈవో వి. జ్యోతి బసు, బాపట్ల జిల్లా ఇన్చార్జి డిఆర్వో లవన్న, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భీమనేని వందనా దేవి,
జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఉమ్మడి గుంటూరు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రీస్టీనా మాట్లాడుతూ  సమగ్ర గ్రామీణ అభివృద్ధి లక్ష్యంతో జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యుల సూచనలతో జడ్పీటీసీలు, ఎంపీటీసీలను సమన్వయం చేసుకుంటూ నిధుల లభ్యతకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం లో 15వ ఆర్థిక సంఘం మొదటి విడతలో వచ్చిన నిధులు రూ. 8.50 కోట్లు, రెండవ విడత లో రూ.9 కోట్లను గ్రామాల్లో మంచినీరు, లింకు రోడ్డుల అభివృద్ధి ప్రాధాన్యత క్రమంలో కేటాయింటం జరిగిందన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ సర్ చార్జి రూ.18 కోట్లు రావాల్సి ఉండగా, కోటి రూపాయలు మాత్రమే మంజూరు చేశారని, మిగతా నిధులు సత్వరమే మంజూరు చేయాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రిని కోరుతూ లేఖ వ్రాయటం జరిగిందని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంకు సాధారణ బడ్జెట్ నిధుల నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూ. ‌60 లక్షలతో పదవ తరగతి చదువుతున్న 32,276 మంది విద్యార్థులకు ఉచితంగా స్టడి మెటీరియల్, రూ.19 లక్షలతో 24,862 మంది విద్యార్థులకు స్టడీ అవర్స్ లో అల్పాహారం అందించటం జరిగిందన్నారు.

అనంతరం సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ 2025-26 సంవత్సర సవరణ బడ్జెట్ మరియు 2026-27 సంవత్సరపు అంచనా బడ్జెట్ వివరాలను ప్రవేశపెట్టారు. దీనిపై జరిగిన చర్చలో  బడ్జెట్ లో పనులకు నిధుల కేటాయింపు పై పలువురు జడ్పీటీసీలు తమ అభిప్రాయాలను తెలిపారు. బడ్జెట్ ఆమోదం కు అవసరమైన సభ్యుల కోరం లేనందున సమావేశం ను వాయిదా వేస్తున్నట్లు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రీస్టీనా ప్రకటించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *