గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ చైర్మన్ బి. సాయి కల్యాణ్ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా లతో కూడిన జిల్లా కమిటీ శనివారం జిల్లా జైలును సందర్శించింది. పురుషులు, మహిళల వార్డులను పరిశీలించారు. జైలులో ఉన్న ఖైదీలతో ముఖాముఖి మాట్లాడి వారికి అందుతున్న వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. భోజన వసతుల నాణ్యత వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. కుల వివక్షలు వంటి సమస్యలు ఉన్నాయా అని ఆరా తీసారు. జైలు సూపరింటెండెంట్ ఎ.బి.కాంత రాజు జైలులో వసతి సౌకర్యాలు, నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, అదనపు ఎస్పీ జి.వి రమణ మూర్తి, డి.ఎస్పీ అరవింద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి, జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.దుర్గా భాయి, వయోజన విద్యా శాఖ ఉప సంచాలకులు కె.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News