రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు జిల్లా వ్యాప్తంగా 2,70,496 మందికి 118.61 కోట్ల పెన్షన్ సొమ్ము పంపిణీ మార్చి ఒకటవ తేదీ ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఒక రోజు ముందుగానే జిల్లా వ్యాప్తంగా సామాజిక భద్రతా పెన్షన్లను ఒక రోజు ముందుగానే ఫిబ్రవరి 28వ తేదీన పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో మొత్తం 2,70,496 మంది లబ్ధిదారులకు 118,61,43,500 పెన్షన్ సొమ్ము అందజేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రతి గ్రామం, వార్డు సచివాలయం స్థాయిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు.
మండలాల వారీగా లబ్ధిదారులు మరియు మంజూరు చేసిన మొత్తం వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
అనపర్తి – 10,046 మంది – 4,32,05,500
బిక్కవోలు – 10,330 మంది – 4,41,92,500
చాగల్లు – 9,104 మంది – 3,95,63,500
దేవరపల్లె – 10,729 మంది – 4,65,97,500
గోకవరం – 10,235 మంది – 4,53,08,000
గోపాలపురం – 8,893 మంది – 3,85,01,500
కడియం – 11,596 మంది – 5,10,10,000
కపిలేశ్వరపురం – 9,798 మంది – 4,27,41,500
కొరుకొండ – 11,939 మంది – 5,40,76,500
కోవ్వూరు – 9,881 మంది – 4,30,44,500
కోవ్వూరు (పట్టణం) – 3,872 మంది – 1,73,89,500
మండపేట – 11,578 మంది – 5,15,60,500
మండపేట (పట్టణం) – 6,623 మంది – 2,92,61,000
నల్లజర్ల – 11,276 మంది – 4,90,71,500
నిడదవోలు (గ్రామీణ) – 10,141 మంది – 4,46,20,000
నిడదవోలు (పట్టణం) – 4,147 మంది – 1,86,53,500
పెరవలి – 10,049 మంది – 4,35,46,000
రాజమహేంద్రవరం (పట్టణం) – 27,732 మంది – 12,23,61,500
రాజమహేంద్రవరం (గ్రామీణ) – 19,718 మంది – 8,75,26,000
రాజానగరం – 15,272 మంది – 6,75,06,000
రంగంపేట – 8,686 మంది – 3,77,28,000
రాయవరం – 9,881 మంది – 4,23,97,500
సీతానగరం – 11,245 మంది – 4,87,67,000
తాళ్లపూడి – 7,575 మంది – 3,28,03,500
ఉండ్రాజవరం – 10,150 మంది – 4,47,11,000
జిల్లా పరిధిలో స్పౌజ్ పెన్షన్ కింద 363 మంది వితంతవు లకి రూ.14,52,000 లను ఈ నెల లో పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. మండలాల వారీగా కొత్తగా మంజూరు చేసిన విధవ పింఛన్లకు మొత్తం 363 మందికి రూ.14,52,000 విడుదల చేయబడింది. అనపర్తి, బిక్కవోలు, చాగల్లు, దేవరపల్లె, గోకవరం, గోపాలపురం, కడియం, కపిలేశ్వరపురం, కొరుకొండ, కొవ్వూరు (గ్రామీణ, అర్బన్), మండపేట (గ్రామీణ, అర్బన్), నల్లజర్ల, నిడదవోలు (గ్రామీణ, అర్బన్), పెరవలి, రాజమహేంద్రవరం (అర్బన్, రూరల్), రాజానగరం, రంగంపేట, రాయవరం, సీతానగరం, తాళ్లపూడి, ఉండ్రాజవరం మండలాలలో ఈ పింఛన్లు మంజూరు చేయబడగా, అత్యధికంగా రాజమహేంద్రవరం (రూరల్)లో 33 పింఛన్లు, నల్లజర్లలో 29, రాజానగరంలో 27 మంజూరయ్యాయి. ఈ మొత్తంతో లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించబడినట్లు అధికారులు తెలిపారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ అందుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News