అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతిలోని సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణానికి భూములిచ్చిన ఉండవల్లి గ్రామానికి చెందిన 10 మంది రైతులకు బుధవారం 2026 మార్చి 18న రాయపూడిలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో ఈ- లాటరీ విధానం ద్వారా 17 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 6 నివాస ప్లాట్లు కాగా 11 వాణిజ్య ప్లాట్లు. ఈ- లాటరీ కార్యక్రమానికి హాజరైన రైతుల సమక్షంలో ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైల్ రన్ వేసిన అనంతరం ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను చేపట్టడం జరిగింది. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు సిఆర్‌డిఏ అధికారులు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమం నిర్వహించిన CRDA స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్/ డైరెక్టర్(ల్యాండ్స్)- క్యాపిటల్ సిటీ వసంతరాయుడు గారు మాట్లాడుతూ..రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరతిగతిన పూర్తి చేసుకోవాలని కోరారు. ప్లాట్లు పొందిన రైతులు భౌగోళికంగా వారికి ప్లాట్లు ఎక్కడ కేటాయించబడ్డాయో వివరించడానికి జి.ఐ.ఎస్. సిబ్బంది, గ్రామ సర్వేయర్లు సహకరిస్తారన్నారు. కార్యక్రమంలో ప్లానింగ్ విభాగ డైరెక్టర్ బి. సురేష్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏ.జి. చిన్నికృష్ణ, సిఆర్డిఏ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News