Breaking News

రంగా అభిమానుల సంక్షేమమే లక్ష్యం

-తెలుగు రాష్ట్రాల రంగా అభిమానుల చర్చించిన తర్వాతే రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయం

-అన్నయ్యకు నాకు ఎలాంటి విభేదాలు లేవు, అన్నయ్య ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉన్నాయి

-కొండపల్లి వంగవీటి కుటుంబానికి పుట్టినిల్లు లాంటిది

-కొండపల్లికి ఆహ్వానించిన అల్తాఫ్ బాబాకు ధన్యవాదాలు

-వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆశా కిరణ్

-శ్రీ శిరిడి సాయిబాబా మందిరం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న ఆశా కిరణ్

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 

పేద ప్రజల ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగ అభిమానుల సంక్షేమమే లక్ష్యం గా ప్రయాణం చేస్తున్నానని, రంగా అభిమానుల ఆలోచన ప్రకారం తన రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు రంగా కుమార్తె ఆశా కిరణ్. కొండపల్లిలో హజ్రత్ సయ్యద్ షాబుఖారి నిత్య అన్నదాన లంగర్ఖానా ద్వారా షిరిడి సాయిబాబా మందిరం అన్నసమారాధన కార్యక్రమం పాల్గొన్నారు ఆశా కిరణ్. ఈ సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం పలికారు. బీ కాలనీ వద్దగల రంగా విగ్రహానికి ఆశ కిరణ్ మరియు అల్తాఫ్ బాబా పూలమాలవేసి నివాళులర్పించారు. సాయి బాబా గుడి లో ధర్మకర్త రాంబాబు ఆశ కిరణ్ దంపతులను బాబా కండువా మరియు చిత్రపటం తో సత్కరించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆప్యాయంగా మహిళలకు స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా అభిమానులు తెలుగు రాష్ట్రాలలో, అన్ని పార్టీలలో, కుల మతాల అతీతంగా ఉన్నారని అన్నారు. వారి సంక్షేమం చూడవలసిన బాధ్యత రంగా కుమార్తెగా తనపై ఉందని అన్నారు. అందుకే రంగా- రాధా మిత్రమండలిని బలోపేతం చేస్తూ రంగా అభిమానులను ఏకతాటిపై తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. రంగా కు రాధా తాను రెండు కళ్ళు లాంటి వాళ్ళమని తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తన ప్రయాణానికి అన్నయ్య పూర్తి మద్దతు ఉందని అన్నారు. రంగా అభిమానులను అందరితో చర్చించిన తర్వాత రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. కొండపల్లి వంగవీటి కుటుంబానికి పుట్టినిల్లు లాంటిదని, ఇక్కడికి రావడం, ప్రజల ఆప్యాయత చూస్తుంటే సంతోషకరంగా ఉందని చెప్పారు. కొండపల్లి ఆహ్వానించిన సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా కు ధన్యవాదాలు తెలిపారు. అల్తాఫ్ బాబా మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే శ్వాసగా జీవించిన రంగా అభిమానులకు, పేద ప్రజలకు సేవలు అందించాలని లక్ష్యంతో ముందుకొచ్చిన ఆశా కిరణ్ ను అభినందించారు, షాబుఖారి బాబా, షిరిడి సాయిబాబా, ఏసుప్రభు ఆశీస్సులతో ఆమె ఉన్నత స్థాయి పదవులు అధిరోహించి తండ్రికి తగ్గ కూతురు లాగా పేద ప్రజలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. తాము సూఫీ ఇజాన్ని ఆచరిస్తూ దైవమార్గంలో ఉన్నామని,సేవ చేయటమే తన లక్ష్యమని తమకు ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేదని ప్రశ్నకు జవాబుగా చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌ -రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు -య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *