Breaking News

వడగాలులు వీచే అవకాశం…

అమరావతి,నేటి పత్రిక ప్రజావార్త :

శనివారం 73 మండలాల్లో తీవ్రవడగాలులు, 17 మండలాల్లో వడగాలులు, ఆదివారం 32 మండలాల్లో తీవ్రవడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎండ తీవ్రత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

శనివారం (04-04-26) శ్రీకాకుళం జిల్లాలో 16, విజయనగరం 24, పార్వతీపురంమన్యం 15, అల్లూరి 3, పోలవరం 9, అనకాపల్లి 2, కాకినాడ 3, తూర్పుగోదావరి 1 మండలాల్లో తీవ్రవడగాలులు(73) వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం 2, పోలవరం 2, అనకాపల్లి 1, కాకినాడ 2, తూర్పుగోదావరి 3, ఏలూరు 4, ఎన్టీఆర్ 1, పల్నాడు 2 మండలాల్లో వడగాలులు(17) ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.

శుక్రవారం మన్యం(జి) భామినిలో 41.8°C, చిత్తూరు(జి) రాయలపేటలో 41.4°C, అనకాపల్లి(జి) నాతవరంలో 40.9°C, శ్రీకాకుళం(జి) జి.సిగడాంలో 40.5°C, నంద్యాల (జి) ఆలమూరు, కడప(జి) బద్వేల్ లో 40.4°C, ఏలూరు(జి) ధర్మాజీగూడెం, తిరుపతి(జి) రేణిగుంట,
విజయనగరం(జి) రాజాంలో 40.3°C,
కృష్ణా(జి) కంకిపాడులో 40.1°C, కర్నూలు(జి) తోవి 40°C చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

వడగాలుల వీస్తున్నందున మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *