Breaking News

జగన్ పెద్దపిచ్చోడయితే, మార్గాని భరత్ చిన్న పిచ్చోడు

-నారా లోకేష్ కాలి గోటికి సైతం సరితూగని వ్యక్తి భరత్
-అమరావతి మహిళలపై రాజమండ్రిలో అతను చేసిన దాడి మర్చిపోలేం
-నాటితోనే అతని రాజకీయ జీవితం ముగిసిపోయింది
-కమ్మ కార్పోరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జగన్ పెద్ద పిచ్చోడు అయితే మార్గాని భరత్ అతన్ని గుడ్డిగా ఫాలో అయ్యే చిన్న పిచ్చోడని కమ్మ కార్పోరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి విమర్శించారు. సామరస్యంగా అమరావతి మహిళలు, రైతులు అరసవిల్లి పాదయాత్రగా వెళుతుంటే జగన్ కళ్ళల్లో అనందం చూడటం కోసం తన బ్లేడ్ బ్యాచ్ తో కల్సి వారిపై రాజమహేంద్రవరంలో దాడి చేసినప్పుడే మార్గాని భరత్ రాజకీయ జీవితం ముగిసిపోయిందన్నారు. రీల్స్ స్టార్ గా, ఏక చిత్ర నటుడిగా, ప్రచారం పిచ్చోనిగా ప్రజల దృష్టిలో ముద్రపడ్డ వ్యక్తి మార్గాని భరత్ అని ఎద్దేవా చేశారు. మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేష్ కాలి గోటికి కూడా మార్గాని సరితూగడని, అటువంటి వ్యక్తి నారా లోకేష్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఒకనాడు అమరావతి, మరో మారు వైజాగ్, ఇంకో రోజు మూడు రాజధానులు, నేడు మావిగన్ ఇలా పిచ్చోడి చేతిలో రాయిలా జగన్ రాజధాని వ్యవహారం మారిందన్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదనలకు పిచ్చోళ్ళ మద్దతు మాత్రమే ఉంటుందన్నారు. సామాన్య ప్రజలంతా జగన్ కి మానసిక రుగ్మత ఏర్పడిందనే అనుకుంటున్నారన్నారు. రేపు జగన్ గోదాట్లో రాజధాని కడతాను అంటే చప్పట్లు కొట్టే మొదటి వ్యక్తి మార్గాని భరత్ అని ఎద్దేవా చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *