తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
డా. బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ముత్యాలరెడ్డి పల్లి, సీతమ్మ నగర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా చైర్మన్, రాష్ట్ర PAC సభ్యులు డా. పసుపులేటి హరిప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ప్రతి భారతీయుడికి మార్గదర్శకమని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ చిరస్మరణీయమని అన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఆయన చూపిన దారిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, విద్య ద్వారానే నిజమైన స్వేచ్ఛ సాధ్యమని అంబేద్కర్ చెప్పిన సందేశాన్ని యువత ఆచరణలో పెట్టాలని సూచించారు. ఆయన ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News