Breaking News

డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు ప్రతి భారత పౌరునికి మార్గదర్శకంగా నిలుస్తాయి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద ఆయన విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు ప్రతి భారత పౌరునికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య మరియు హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని, యువత ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. అలాగే సమాజంలో అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన బాధ్యత ఉందని, అంబేద్కర్ గారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ కి ఘనంగా నివాళులు అర్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *