-ఢిల్లీలో ఏపీ మహిళా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశం
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలను అన్ని రంగాల్లో ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) స్పష్టం చేశారు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్టీ మహిళా ప్రజాప్రతినిధులతో ఎంపీ కేశినేని చిన్ని ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల దూరదృష్టితో కూడిన నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వివరించారు. మహిళలు రాజకీయంగా ఎదిగేందుకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షల మేరకు ‘నారీ శక్తి’ని మరింత బలోపేతం చేయడంలో తమ వంతు కృషి చేస్తామని కేశినేని చిన్ని పునరుద్ఘాటించారు. దేశ నిర్మాణంలో మహిళల పాత్రను గుర్తించి, వారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన పలువురు మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News