-శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని ఈవోగా నియమించాలి..
-గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడనాడాలి.
-అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతంలో డిగ్రీ కళాశాలను నిర్మించాలి.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ట్రాఫిక్ సమస్యలతో నిత్యం సతమతమవుతున్న వాంబే కాలనీ, సింగ్ నగర్ ప్రజలకు ట్రాఫిక్ సమస్యలను అరికట్టేందుకు మధుర నగర్ మరియు బి ఆర్ టి ఎస్ రోడ్డు అనుసంధానం చేస్తూ అండర్ రైల్వే బ్రిడ్జి ఏర్పాటు చేయాలి.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలి.. రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతికి అడ్డుకట్ట వేయాలి. వంటి పలు డిమాండ్లతో నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నగర కాంగ్రెస్ కార్యాలయం నందు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ చుట్టుపక్కల నాలుగు జిల్లాల నుంచి ప్రజలు మెరుగైన వైద్యం కోసం విజయవాడ జి జి హెచ్ హాస్పిటల్ కి నిత్యం వస్తూ ఉంటారని కానీ హాస్పిటల్లో ఎలాంటి సదుపాయాలు అందుబాటులో లేకపోవడం.. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి తొలగించిన కాలును కుక్కలు పీక్కుతిన్న సంఘటన రాష్ట్రంలోనే ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్నటువంటి విధి నిర్లక్ష్య వైఖరిని తెలపకునే తెలుపుతుందని.. సదరు సంఘటనకు రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి సత్య కుమార్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత రెండో స్థానంలో ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయానికి సీనియర్ ఐఏఎస్ స్థాయి అధికారిని ఈవోగా నియమించాలని ఇప్పటికే దేవస్థానంలో సిబ్బంది నుంచి సెక్యూరిటీ షాప్స్ వరకు అనేక అవకతవకలు జరుగుతున్నాయని భక్తులకు సేవలను అందించడంలో దేవస్థానం అధికారులు విఫలమయ్యారని ప్రజలలో వస్తున్న విముఖతను గుర్తించాలని అన్నారు..
పిసిసి పూర్వపు ప్రధాన కార్యదర్శి షేక్ అన్సారి మాట్లాడుతూ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైకిరిని నిరసిస్తూ నిన్న కాక మొన్న మొదలుపెట్టిన భోగాపురం ఎయిర్పోర్ట్ రేపో మాపో ప్రారంబోత్సవానికి రెడీగా ఉందని తెలుపుతూ ఇప్పటికైనా గన్నవరం విమానాశ్రయంపై శ్రద్ధ చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎన్.ఎస్.యు.ఐ. స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిందని నగరవ్యాప్తంగా కేవలం ఒకటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉందని సింగినగర్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. సింగినగర్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉందని పాయికాపురం, ప్రకాష్ నగర్, కండ్రిక, రాజీవ్ నగర్ మరియు వాంబే కాలనీ సింగినగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తగ్గేందుకు మధురానగర్ను కలుపుకుంటూ అండర్ రైల్వే బ్రిడ్జి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడమైనది.
నగర్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని శాఖల్లో అవినీతి విచ్చలవిడి అయిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అవినీతిని అరికట్టి అవినీతి రహిత రాష్ట్రంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Prajavartha Online Telugu News