Breaking News

డప్పువాయిద్య కళాకారులు ప్రదర్శన, సభ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఎంజీ రోడ్, అంబేడ్కర్ విగ్రహం వరకు వేలాది డప్పు కళాకారులు తో ప్రదర్శన, సభ జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ​భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, యువ నాయకులు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి.. సామాజిక చైతన్యం రగిల్చడానికి, ఈ సమాజంలో ఉంటున్న సామాజిక అసమానతలను ఎత్తిచూపుతూ.. వాటిని సరిచేయడం కోసం అనేక రకాలైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. ఇవాళ బడుగు, బలహీన వర్గాల కోసం, అనగారిన వర్గాల కోసం భారతీయ జనతా పార్టీ ఉందనే ఒక సందేశాన్ని, కూటమి ప్రభుత్వం ఉందనే ఒక సందేశాన్ని సమాజంలోకి తీసుకెళ్తున్న బీజేపీ అధ్యక్షులు పి.ఎన్. మాధవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తపనా చౌదరి, నిర్మల కిషోర్, తెలుగు సంస్కృతి అకాడమీ చైర్మన్ విల్సన్, మాజీ శాసనసభ్యులు దారా సాంబయ్య, ఇవాళ కార్యక్రమంలో పాల్గొంటున్న అనేకమంది బీజేపీ సోదర కార్యకర్తలకి, కూటమి నాయకులకి, కార్యకర్తలకి.. ముఖ్యంగా, ఇవాళ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న దప్పు కళాకారులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
​ముందుగా 135వ జయంతి సందర్భంగా.. గత ఏప్రిల్ 14, 135వ జయంతి ఉత్సవాల్ని మనం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పరంగా, పార్టీల పరంగా, సామాజిక పరంగా కూడా జరుపుకున్నాం. కానీ అటువంటి మహనీయుడికి.. ఈ దేశం కన్న ముద్దుబిడ్డ, అత్యంత ప్రతిభావంతుడు, ప్రపంచంలోనే అత్యంత మేధో సంపత్తి కలిగినవాడిగా పేరుగాంచినవాడు, అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కి నివాళులర్పిస్తూ..
​అటువంటి మహనీయుడు జయంతి రోజో, వర్ధంతి రోజో గుర్తుచేసుకోవడం, పూలమాలలు సమర్పించుకోవడం కాకుండా.. వారి ఆశయాలని, స్ఫూర్తిని ఆచంద్రతారార్కం ఉండేలాగా ప్రయత్నం చేస్తూ.. గత 35 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అటు విజయనగరం నుండి ఇటు హిందూపురం దాకా అనేక రకాలైన కార్యక్రమాలు రూపకల్పన చేసి, ఆ మహనీయుని గొప్పతనాన్ని ఊరూరికి, వాడవాడకీ తీసుకెళ్తూ.. నిజమైన నివాళులర్పించే దిశగా ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, యువ నాయకులు పడతాల సురేష్ కి నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
​అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చి, ఈ రకంగా కూడా నివాళులర్పించవచ్చా అని యావత్ ఆంధ్రప్రదేశ్ ఆశ్చర్యపోయేలాగా.. ఆశ్చర్యపోయేలాగా చేసి, ఇవాళ ఈ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా.. సమాజంలో అత్యంత ప్రధాన భూమిక వహిస్తున్న దప్పు కళాకారులను ముఖ్య అతిథులుగా పిలిచి, వారి కళా వైభవాన్ని చాటిచెబుతూ.. డాక్టర్ అంబేద్కర్ గారికి ఎటువంటి నివాళులర్పించామో మనమంతా ఇవాళ చూశాం. ఎందుకు ఇవాళ దప్పు కళాకారులని ఎన్నుకున్నామని నేను అడగగా… సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర ఉంది అన్నారు. అదేంటి సురేష్ అని అడిగా. అన్నా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మన ఉత్కృష్టమైన సంస్కృతి సాంప్రదాయాలకి, ఘనమైన వారసత్వ సంపదకి ప్రతీకలు డప్పు కళాకారులు అని చెప్పారు. వారు అందించేది కేవలం వినోదం కాదు, కేవలం సంగీతం కాదు, మన వారసత్వ సంపదకి, సంస్కృతికి పరిరక్షకులు వారు అని చెప్పారు. పండగ దగ్గరికి వచ్చినా, ఏ ప్రబంధం జరిగినా, ఏ పెళ్లి జరిగినా, ఏ ఊరేగింపు జరిగినా, ఏ సామాజిక ఉద్యమం జరిగినా అది జయప్రదం కావాలన్నా, సఫలవంతం కావాలన్నా, ఉత్సాహం నిండాలన్నా ఎవరయ్యా ముందు వరుసలో ఉండేది అంటే? డప్పు కళాకారులేనని చెప్పారు.
​డప్పు వాయించడమనేది కేవలం వినోదం కాదు, ఇది కేవలం సంగీతం కూడా కాదు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల భావోద్వేగానికి సంబంధించిన విషయం. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలని ఐక్యంగా ఉంచే ఒక భావోద్వేగం. అటువంటి డప్పు కళాకారులు తాము కష్టపడుతూ సమాజాన్ని ఐక్యంగా ఉంచడమే కాకుండా, సామాజిక బాధ్యతను కూడా వహిస్తూ ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఊరేగింపు వచ్చినా, ఏ దండోరా వేయాలన్నా గ్రామాల్లో డప్పు పట్టుకొని వచ్చేది ముందు ఎవరయ్యా అంటే?
​అది కోవిడ్ మహమ్మారి సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల సందర్భంలో కానీ, లేదా మొహం, మలేరియా బారిన పడకుండా, డెంగ్యూ బారిన పడకుండా కాపాడుకోవాల్సిన అవసరంలో గానీ, ఇతర ఏ ఇబ్బంది వచ్చినా లేదా ఒక మంచి సామాజిక కార్యక్రమం గురించి గానీ లేదా ఒక మంచి కార్యక్రమం గురించి గానీ లేదా ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక సంక్షేమ పథకం కానీ లేదా నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకం గానీ గ్రామీణ ప్రాంతాల్లో పెరగాలి, ప్రజల వద్దకు వెళ్ళాలి, ఆ అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లభించాలంటే ముందు ముందు వరుసలో ఉండేది ఎవరయ్యా?
​ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలకి, ఘనమైన వారసత్వ సంపదకి ప్రతీకలుగా ఉంటూ సమాజానికి, భావితరాలకి కూడా మనకు ఆ సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేస్తూ పాశ్చాత్య వ్యామోహంతో ఆ బారిన పడి జీవితాల్ని నాశనం చేయకుండా ‘అయ్యా! మన భారతీయ సంస్కృతి అంటే ఇంత ఉత్కృష్టమైనదయ్యా, దీన్ని కొనసాగించాల్సింది అయ్యా, దానికి మేము ముందు వరుసలో ఉంటామయ్యా’ అని సమాజానికి చెప్పేది ఎవరయ్యా అంటే?
​అటువంటి డప్పు కళాకారుల ద్వారా ఇవాళ అటువంటి మహనీయుడు అంబేద్కర్ కి నివాళులర్పించడం చాలా గొప్ప విషయం. ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చింది, ఇవాళ వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. కానీ, ఈ సందర్భంగా నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ ఒక విషయాన్ని మాత్రం చెప్పాలి. మనందరికీ తెలుసు, ఈ బడుగు, బలహీన వర్గాల, నొచ్చు బిడ్డల్లో ముందు వరుసలో ఉండేది ఎవరయ్యా అంటే? డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. కానీ, ఆ గొప్పతనాన్ని గుర్తించడానికి, అటువంటి అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకి నిర్మించిన వ్యక్తిని గుర్తించడానికి అనేక సంవత్సరాలు పాలించిన పాలకులు ఇష్టపడలేదు. ఎందుకయ్యా అంటే, 1954 లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పార్లమెంటుకు పోటీ చేసి, లోక్‌సభకు పోటీ చేస్తే అప్పుడు దేశ ప్రధానమంత్రిగా ఉంటున్న వ్యక్తి ఆయనకు వ్యతిరేకంగా తన పీఏ ని పోటీ చేయించి, చాలా దారుణంగా, 1952 ఎన్నికల్లో ఓడింపజేశారు. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలైన దేశంలో లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే, కాంగ్రెస్ తరపున పోటీ చేసి అంబేద్కర్ గారి ఓటమిని చెందేదాకా ఊరుకోలేదు. మళ్ళీ 1954 లో, 1954 లో ఉపఎన్నిక వస్తే, ఆ ఉపఎన్నికలో మళ్ళీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లోక్‌సభకు పోటీ చేస్తే మళ్ళీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉంటున్న వ్యక్తి మళ్ళీ ఆ పీఏ ని పోటీకి ఇంకో వ్యక్తిని పోటీ చేయించి రెండోసారి… ​”1956లో అటువంటి మహనీయుడు మరణించిన తర్వాత, ఆయన అస్థికలను తీసుకురావడానికి వాళ్ళ ఆవిడ వేడుకుంటే, ప్రభుత్వాన్ని వేడుకుంటే.. అయ్యా! విమానంలో అంబేద్కర్ గారి అస్థికలను తీసుకెళ్లడానికి నాకు అవకాశం కల్పించమని అంటే.. ఆనాటి ఇటువంటి వ్యక్తిగత పనుల కోసం ప్రభుత్వాన్ని వాడుకోవడానికి మేము ఇష్టపడమని చెప్పి ఆనాటి ప్రభుత్వం చెప్పింది.
​పోనీ అటువంటి మహనీయునికి గుర్తుగా ‘భారతరత్న’ అవార్డు ఇచ్చారా? అంటే ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చుకున్నారు అంటే.. తను ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు 1954లో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ తనకు తాను భారతరత్న ఇప్పించుకున్నాడు గానీ, అంబేద్కర్ గురించి ఆలోచించలా!
​మళ్ళీ ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు.. తనకు ప్రధానమంత్రిగా ఉండగానే తనకు తాను భారతరత్న అవార్డు ఇప్పించుకుంది గానీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కి ఇవ్వలేదు.
​కానీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కి ఎప్పుడయ్యా ఆయన గౌరవాన్ని, గౌరవం కల్పించింది ఎవరయ్యా అంటే.. 1989లో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, అప్పటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంలో నాన్-కాంగ్రెస్, కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడితే.. కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు గాని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కి 1990లో భారతరత్న రాలేదంటే.. ఈ దేశాన్ని పాలించిన పార్టీలు సిగ్గుపడాలా? వద్దా? అటువంటి మహనీయునికి అవమానం జరిగిందా? లేదా?
​దాన్ని సరిచేసే ప్రయత్నం ఇవాళ, ఇవాళ దేశంలో జరుగుతోంది. ఆయన ఎక్కడైతే జన్మించాడో, ఎక్కడైతే చదువుకున్నాడో, ఎక్కడైతే కాలేజీకి పోయాడో, ఎక్కడైతే లండన్ లో నివసించాడో, ఎక్కడైతే మరణించాడో.. ఆ ప్రాంతాలన్నిటినీ ‘పంచ తీర్థాలు’గా నిర్మించి, ఇవాళ అక్కడంతా ఒక మెమోరియల్స్ నిర్మించి, నిజమైన నివాళులు అర్పించే పని ఇవాళ ఈ దేశంలో జరుగుతోంది.
​అదే విధంగా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో విదేశీ విద్యా పథకానికి.. నేను మళ్ళీ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, తప్పులేదు ఇది.. విదేశీ విద్యా పథకానికి గతంలో పేరు ఏదైనా ఉండేది అంటే ‘డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం’ అని ఉండేది. 2019-24 మధ్య డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి పేరు తీసేసి ఇంకో పేరు పెట్టుకొని విదేశీ విద్య అన్నారు. ఆ పేరు ఏంటో మీకు తెలుసా? అంటే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కంటే గొప్పవాళ్లా? గొప్పవాళ్లా? గొప్పవాళ్లా? మరి ఆయన పేరు ఎందుకు తొలగించారు?
​సమాధానం లేదు, ఎవరో అంటున్నారు సిగ్గులేక అని. సరే నేను ఆ విషయాలు, ఆ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ అటువంటి మహనీయునికి గౌరవం దక్కే విధంగా ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో పని జరుగుతా ఉంది.
​ఒకవైపు అనేక రకాలైన కార్యక్రమాలు.. డప్పు కళాకారులకి వారికి ఏం జరగాల్సి ఉంది, ఇంకా సమాజంలో వారికి ప్రోత్సాహం ఎలా అందించాల్సి ఉంది, ప్రభుత్వం నుంచి వారికి ఏ రకమైన సహకారం లభించాలనే విషయాన్ని సోదరుడు పంతా సురేష్ ఇప్పుడే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన అనేక విషయాల్ని కేంద్రంలో ప్రధానమంత్రి దృష్టికి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి డప్పు కళాకారులకి, అనగారిన వర్గాలకి న్యాయం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
​అనేక రకాలైన సంక్షేమ పథకాలు వచ్చాయి పేదల కోసం.. ఇల్లు వచ్చినా లేదా పెన్షన్స్, బీమా పథకాలు వచ్చినా, సురక్ష బీమా యోజన వచ్చినా, జీవన్ జ్యోతి బీమా యోజన వచ్చినా.. లేదా మన కుటుంబాల్లో చదువుకున్న వారికి ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యోజన వచ్చినా లేకుంటే నైపుణ్య శిక్షణ ఇచ్చేదానికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన వచ్చినా, రాష్ట్రంలో కూడా స్కిల్ సెంటర్స్ చేసినా.. అనేక రకాలైన కార్యక్రమాల్ని ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తోంది.
​ఒకవైపు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ సమాజంలో ఎవరి పట్ల వివక్ష లేకుండా, వివక్ష చూపకుండా అభివృద్ధి, సంక్షేమం అందరికీ చెందేలాగా చూసి, రాబోయే రోజుల్లో ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించాలనే దిశగా ప్రయత్నాలు చేస్తుంటే.. మరొకవైపు ఈ దేశాన్ని వికసిత భారత్ నిర్మాణం చేసి, ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెంచి, ప్రతి జీవితంలో వెలుగులు నిండేలాగా, సామాజిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించేలాగా… నిర్మించాలగా, అక్కచెల్లెమ్మల మీద అరాచకాలు తట్టుకోలేదని సమాధానం నిర్మించాలగా ప్రయాసాలు చేస్తాఉంది. మేము కోరుతున్నదంతా ఈ సందర్భంగా అంబేద్కర్ పాదాల పద్మాల నుంచి రాష్ట్ర ప్రజలను కోరుతున్నది ఏంటంటే… మీరు ఆశీర్వదించారు, ఆశీర్వదించడాన్ని కొనసాగించండి. మీ ఋణాన్ని తీర్చుకునేటటువంటి ప్రభుత్వ కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంటూ… ఇటువంటి అద్భుత కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసుకున్న, చేసుకుంటున్నందుకు రాష్ట్ర అధ్యక్షులు బివిఎన్ మాదిగ కి, సోదరుడు వరదాల సురేష్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలన్నారు.

ఈ సందర్భంగా బిజెపి ఎపి అధ్యక్షులు పివియన్ మాధవ్ మాట్లాడుతూ…పెద్ద ఎత్తున సుమారు 2000 మంది దప్పు కళాకారుల రాష్ట్రీయ వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి వచ్చారు. ముందుగా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో, కార్యక్రమానికి ముందు నడిపించడంలో పనిచేసిన ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పంతాల సురేష్ కి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన కార్యక్రమంలో… ​అలాగే మన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి, మన అందరికీ కూడా వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తున్న అన్న సత్య కుమార్ యాదవ్ గారు, ఆయన రాష్ట్ర వైద్య శాఖ మంత్రిగా ఉంటూ కూడా, మొత్తం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ, అత్యంతం మనందరితో కలిసి నడిచి, మనందరికీ గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఇవాళ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తప్పకుండా మీ అందరినీ ఆదుకుంటుందని సత్య కుమార్ నేతృత్వంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను.
​అలాగే మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కి, అలాగే తెలుగు సంస్కృతి అకాడమీ చైర్మన్ ఆత్రం భాస్కర్ కి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషించిన కృష్ణా జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సర్వసిద్ధి రాజు కి, అలాగే భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు, అలాగే ఎస్సీ మోర్చా యొక్క ఇంచార్జ్ నిర్మల కిషోర్ కి, అలాగే తపనా చౌదరి కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే రాష్ట్ర కార్యదర్శి నూతక నాగ లక్ష్మి కి, అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క జిల్లా యొక్క అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ కి, మిగతా అందరి నేతలకు ఎవరైతే ఈ కార్యక్రమం కోసం అహర్నిశలు కృషి చేసి, అందరి దప్పు కళాకారులని సేకరించి తీసుకొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, జై భీములు తెలియజేస్తూ…
​ఇవాళ దప్పు కళాకారుల యొక్క గుర్తింపు, గౌరవం మీరు ఇచ్చేంతవరకు పనిచేస్తాం. ప్రతి ఊరు వెళ్తాం, మీ అందరి అండ ఉంటాం. ఏ అంశాలైతే మేము పబ్లిక్ తో రాశామో, మీ అందరికీ పెన్షన్స్ సంబంధించిన అంశం – 40 సంవత్సరాలు దాటిన ప్రతి దప్పు కళాకారునికి గుర్తింపు కార్డు ఇచ్చి, ఆ విధంగా వారి యొక్క పెన్షన్ ఇచ్చే విధంగా ప్రయత్నం. అలాగే దప్పు కళాకారులకు సంబంధించిన ఉచిత బస్సు సౌకర్యం గానీ, అలాగే దప్పు కళాకారులకు సంబంధించిన కుటుంబాలలో విద్య, వైద్యం, అలాగే ఇళ్ళు ఇప్పించడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ…
​అలాగే అతి ముఖ్యమైన, అతి ముఖ్యమైన అంశం – చాలామంది మర్చిపోతుంటాం, ఇవాళ గ్రామ సభలు ఎక్కడ నిర్వహించినా, గ్రామస్థులంతా సక్రమంగా ఉన్నా ఇవాళ డండోరా వేస్తారు. అలాగే ఈ డండోరా చేసే కళాకారుల గుర్తింపు లేదు, వాళ్లకు కూడా ఒక పోస్టు ఇవ్వాలి, ఆ విధంగా ప్రతి పంచాయతీలో ఒక దప్పు కళాకారుడిని ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి…
​వాళ్లకి తగిన స్థానాన్ని ఇవ్వాలి, ఒక పోస్టు క్రియేట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.
​అలాగే, మరి ముఖ్యంగా మన యొక్క సనాతన ధర్మం, ఇవాళ ఈ యొక్క సనాతన ధర్మం గురించి తెలియని వాళ్ళు.. ఆది, మధ్య, అంతము లేని ఒక గొప్ప సంస్కృతి అందించిన ఈ యొక్క జాతి, ఈ జాతికి ఏదైతే భారతదేశంలో ఉన్నాయో దేవాలయాలు, చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంది – దేవాలయం అంటే అది ఒక బ్రాహ్మణుల నిలయంగా. కాదు! ఈ యొక్క దేవాలయ వ్యవస్థ నిర్మాణం చేసిన దాంట్లో దళితులకి, బలహీన వర్గాలకి, మిగతా అన్ని జాతలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు అనే విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలి. తిరుపతికి సంబంధించిన స్వామి వారి యొక్క తొలి గడప కాటి (దాటి), ఆ యొక్క స్వామి వారికి మేల్కొలుపు చెప్పేవాళ్ళు ఎవరైనా అనుకుంటే, వాళ్ళు దళిత, బలహీన వర్గాలని గుర్తించాలి, దప్పు కళాకారులని గుర్తుంచాలి.
​కేవలం ఒక తిరుపతే కాదు… సన్నిధి గొల్ల అని ఒక గొప్ప సాంప్రదాయం ఉంది. గొల్లవాడు వెళ్లి స్వామి వారి యొక్క తలుపు తీసి, స్వామి వారికి మేల్కొలుపు కొట్టాలి, లేకపోతే మన దప్పు కళాకారులు దప్పు కొట్టాలి. ఆ విధంగా గొప్ప వ్యవస్థ కేవలం ఒక దేవాలయంలో కాదు, అన్ని దేవాలయాలలో… తప్పనిసరిగా మంగలి వాయిద్యం లాగా, డప్పుకు అనే విషయం ఆ డప్పుకు గుర్తింపు ఇవ్వాలని దేవాలయ వ్యవస్థలో తప్పనిసరిగా డప్పు కూడా సన్నాయి డోలుతో పాటు పెట్టాలి అని చెప్పి పెట్టే విధంగా ప్రయత్నం చేస్తాం. చావుకు మేళం…
​ఆ విధంగా మీ అందరికీ కూడా తగిన గుర్తింపు ఇస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇవాళ డప్పుకు సంబంధించిన అనేకమంది కళాకారులకి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా తిరుగుతున్న మన మందకృష్ణ మాదిగ గాని, గడ్డం సమ్మయ్య గాని వీళ్ళు కూడా డప్పు కళాకారులనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. వీళ్ళిద్దరికీ కూడా భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ఇచ్చి గౌరవించింది అనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
​సమ్మయ్య గాని, మందకృష్ణ మాదిగ గాని ఈ యొక్క డప్పుని వాయిస్తే ఎంత అద్భుతంగా వాయిస్తారో తెలుసా? అంత అద్భుతంగా వాయిస్తారు. కనుక వాళ్ళకి పద్మశ్రీ ఇచ్చారంటే మీ అందరికీ పద్మశ్రీ ఇచ్చారనే విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. రాబోయే కాలంలో మీలో ఎవరికైనా ఆ యొక్క సన్మానం జరుగుతుందని నేను తప్పనిసరిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే…
​పైన నరేంద్ర మోదీ ఉన్నారు. ఆయన నేడు ప్రధానమంత్రి అయ్యారంటే దానికి కారణం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కానీ, ఈ భూమి మీదే పుట్టకపోయి ఉంటే ఆయన ప్రధానమంత్రి అయ్యేవాడు కాదండి.
​మోదీ ప్రధానమంత్రి అవ్వడానికి కారణం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్. కేవలం ఆయనే కాదు, అనేకమంది వెనుకబడిన, దళిత నాయకులు ముఖ్యమంత్రులు గాని, మంత్రులు గాని అయ్యారంటే ఆయన కారణమే. అనేకమంది ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్స్ అయ్యారంటే ఆయన కారణంగానే. అనేకమంది అనేక రకాల ఉద్యోగాలు చేస్తున్నారంటే, విద్య తక్కుతోందంటే ఆయనే కారణం. కనుక అటువంటి మహానుభావుడికి ఏ విధంగా నివాళులర్పించాలి? తప్పనిసరిగా మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. ఆయన చెప్పారు మనకి విముక్తి కేవలం చదువు ద్వారానే అవుతుంది. మనమందరం మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి. మనమందరం కూడా సమీకరించబడాలి, మనమందరం కలవాలి, కలిసి నడవాలి. ఎవరి ప్రోద్బలంతో మనం అడుగులు తప్పటడుగులు వేయాల్సిన అవసరం లేదు. అలాగే మనం కలిసి పోరాటం చేయాలి. ఇదే మూడు అస్త్రాలు, ఈ మూడు అస్త్రాలే మనకి వజ్రాయుధాలు అనే విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తించాలి. మన యొక్క బ్రతుకు పాఠాలకి అడ్డంకులు తొలగించుకోవాలంటే చదువు విముక్తి కలిగిస్తుంది. మనమందరం కలిసి పోరాటం చేయడం, ఆ విధంగా సమీకరించబడాలి. ఇవాళ ఈ యొక్క డప్పు కళాకారులని సమీకరించే ఉద్దేశం కూడా అటువంటి గొప్ప ఉద్దేశం అని మీకు తెలియజేస్తున్నాం. అనేక సంఘాలు కలిసి అటువంటి గొప్ప ప్రయత్నాన్ని తప్పనిసరిగా చేస్తున్నాయనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
​డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ని రాజ్యాంగ పరిషత్ చైర్మన్‌గా చేసిన సందర్భంలో మహాత్మా గాంధీ ని రాజాజీ వచ్చి ఒక ప్రశ్న అడుగుతారు.
​”గాంధీ, మిమ్మల్ని కులం పేరు మీద తిట్టిన వ్యక్తి, ప్రపంచ వేదికల్లో అవమానించిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ని ఏ విధంగా నువ్వు రాజ్యాంగ పరిషత్ చైర్మన్‌ను చేస్తున్నావు?” అని రాజాజీ అడిగితే…
​మహాత్మా గాంధీ చెప్పారు: “అవును నిజమే, నాకు అంబేద్కర్ గారికి అనేక విభేదాలు ఉన్నాయి. నన్ను ఆయన ఎక్కడా గౌరవించలేదు. కానీ రాజాజీ… నువ్వు, నేను, ఈ యొక్క సభా ప్రాంగణంలోని అందరి మేధావుల యొక్క మేధస్సు కలిపినా డాక్టర్ అంబేద్కర్ ముందు సమానం కాదు” అని రాజాజీకి చెప్పారు.
​ఎందుకంటే ఆ విధంగా చదువుకున్నారు. అటు కొలంబియా విశ్వవిద్యాలయంలో, ఇటు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రెండు పిహెచ్‌డిలు పొంది, ఆయన చదివిన చదువు ఎవ్వరూ చదవలేదు. కొలంబియా విశ్వవిద్యాలయం రాసి ఉంచుతుంది… లక్షకు పైగా పుస్తకాలు చదివిన ఏకైక వ్యక్తి, ఈ భూమి పైన పుట్టిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని చెప్పి…

లేక అనుసరించాలి. ఏ విధంగా ఆలోచన చేయాలి, ఏ విధంగా మన జీవితంలో ఆయన ప్రేరణ, స్ఫూర్తిగా తీసుకోవాలి తప్పనిసరిగా గుర్తించాలి. అటువంటి కార్యక్రమమే మేము చేస్తున్నాము. కేవలం ఆయనకు నివాళులు అర్పించే దండ వేయటమే కాకుండా, ఆయన యొక్క జీవిత విశేషాలు కేవలం మనమందరం కూడా తప్పనిసరిగా చేయాలి. ఇవాళ అనుకునే మనమందరం కూడా మన జీవితంలో ఆయన చేసిన అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇవాళ అనేక రకాల సమాచారాలు, తప్పుడు సమాచారాలు పంపిస్తున్నారు. అంబేద్కర్ ఏ కులానికి వ్యతిరేకం కాదు.
​ఈ మధ్య చాలా మంది మాట్లాడుతున్నారు బ్రాహ్మణులకు సంబంధించిన అంశాన్ని మాట్లాడుతున్నారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జీవితం చూస్తే, ఆయన జీవితంలో నలుగురు ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యొక్క ఏదైతే ఇంటి పేరు ఉందో ఆ పేరు కూడా గంగాధర్ అంబేద్కర్ అని… గంగాధర్ శాస్త్రి అనే ఆయన ఖచ్చితంగా స్నేహితుడు. ఆయనే కేశవ్ కృష్ణజీ అంబేద్కర్ అని పేరుగా పరిచయం చేశాడు. ఆయన అంబేద్కర్ గారి యొక్క చిన్నప్పుడే భీమ్‌రావ్ సక్పాల్ అనే వ్యక్తి యొక్క చిన్నప్పుడే ఆయన యొక్క మేధస్సు చూసి, ఆయనకు అంబేద్కర్ అనే నాయక సబ్‌నేమ్ ఇస్తానని చెప్పి ఆ విధంగా అంబేద్కర్ అనే సబ్‌నేమ్ ఇచ్చిన వ్యక్తి.
​కేవలం అంతే కాదు, ఆయన చేసిన మొదటి పోరాటం, మహాద్ పోరాటం. ఆయన యొక్క మిత్రులు ఏ.కే. కరే అనే వ్యక్తి. అలాగే చివరికి ఆయన అనారోగ్యం పాలైతే, ఆయన ఆరోగ్యాన్ని బాగు చేసి ఆ తర్వాత సహధర్మచారిణిగా ఉన్న సవితా అంబేద్కర్… వీళ్ళందరూ బ్రాహ్మణ జాతికి చెందిన వాళ్ళే. వీళ్ళందరూ అంబేద్కర్ కి స్ఫూర్తి, ప్రేరణగా, మార్గదర్శనాన్ని అందించిన వాళ్ళే. అంబేద్కర్  ఎప్పుడు కూడా ఒక కులాన్ని నిందించిన దాఖలాలు లేవు. అనేక రకాల విషయాలు ఆరోజు హిందూ ధర్మంలో అనేక రకాల వివక్షకు సంబంధించిన అంశాలు మాట్లాడారు. ఆ ఏదైతే విర్రవీగుతున్న బ్రాహ్మణ తత్వానికి సంబంధించిన అంశాన్ని మాట్లాడారే గానీ… అందరూ ఇక్కడ ఉండాలి అసలు మోహనరావు. అందరూ అటు ఉండండమ్మ.
​ఒకసారి అంబేద్కర్ కి మనం మీ యొక్క బోనాల ద్వారా హారతి ఇద్దాం. ఒక్క నిమిషం, అయిపోతుంది. ఆ విధంగా చేశారు అనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఏ ఏ కులాన్ని కూడా, ఏ మతాన్ని కూడా కించపరచకుండా అందరి వాడుగా తిరిగిన అంబేద్కర్, ప్రపంచాది నేతగా ఉండాలి. అందరి పోరాటాలకి, అన్ని సామాజిక ఉద్యమాలకి ఆయన నేతృత్వం వహించాడనే మన యొక్క ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ వాంఛించారు. ఆయన యొక్క కలని తీర్చడానికే మేమందరం పనిచేస్తాం. ఆ విధంగా అంబేద్కర్ యొక్క కల మన అందరి కల కావాలని చెప్పి, ఈ దేశంలో అసమానతలు లేని సమాజ నిర్మాణం చేయడం కోసం, ఎవరైతే ఏ వర్గాలైతే అనగారిపోయారో వారి యొక్క జీవితాన్ని ఉద్ధరించడం కోసం ముందుకు తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ… అంబేద్కర్ కి నివాళులు అర్పించడానికి ఇవాళ బోనాలు కూడా తీసుకొచ్చాం.
​ఇక్కడ అందరికీ కూడా ఇప్పుడే కర్పూరం ఇచ్చి ఆయనకు నీరాజనాలు పలుకుతాం. ఆ విధంగా అంబేద్కర్ గారికి గొప్ప నివాళులు అర్పించే విధంగా… కేవలం నివాళే కాదు, ఆయన స్ఫూర్తి తప్పనిసరిగా పొంది ఈ యొక్క రాజకీయ జీవితంలో ముందుకు అడుగులు వేస్తాం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో తప్పనిసరిగా ప్రతి దళిత సోదరుని, సోదరీమణిని మేము పిలుపిస్తున్నాం. రండి, కలిసి మాతో నడవండి, మీ యొక్క జీవితాలు బాగు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున మీ అందరికీ పిలుపునిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు, సంస్కృత బోర్డు అధ్యక్షుడు ఆర్ డి విల్సన్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నేతలు ఉదయ్, బసవరాజు, రాకేష్, గంగాధర్, దారా సాంబయ్య, సర్వ శుద్ధి రాజు, జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, బిజెపి ఉపాధ్యక్షుడు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, నిర్మల కిషోర్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా, రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, అఖిల్‌ భారత యాదవ సంఘం నాయకులు లాకా వెంగళరావు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *