Breaking News

గ్రీనరి అభివృద్ధి చేయుటకు ప్రణాళికలు సిద్దం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్.టి.ఆర్ స్టేడియాన్ని అధునాతన ప్రమాణాలతో, ఆహ్లాదకరంగా ఉండేలా గ్రీనరి అభివృద్ధి చేయుటకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ తెలిపారు. శనివారం నగర పాలక సంస్థలోని కమిషనర్ ఛాంబర్ నందు ఎన్.టి.ఆర్ స్టేడియం పాలకవర్గం మరియు ఆకాష్ ఆర్కిటెక్ ప్రతినిధులతో, జియంసి అధికారులతో ఎన్.టి.ఆర్ స్టేడియం అభివృద్ధి పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

సమావేశం నందు తొలుత స్టేడియంలో మహిళకు, పురుషులకు వేరుగా వేరుగా జిమ్ లను అభివృద్ధి చేయడానికి ఆకాష్ ఆర్కిటెక్ సంస్థ ప్రతినిధులు తయారు చేసిన ప్రతిపాదనలు మరియు డిజైన్స్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో ఎన్.టి.ఆర్ స్టేడియానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, అటువంటి స్టేడియాన్ని ప్రజల సౌకర్యార్ధం అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆహ్లాదకరంగా ఉండేలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దానికి కోసం ప్రత్యేకంగా కన్సల్టెంట్ల ద్వారా ప్రతిపాదనలు తయారు చేయిస్తున్నామన్నారు. సదరు కన్సల్టెంట్లు స్టేడియంలోని జిమ్ లను స్రీ, పురుషులకు ప్రత్యేకంగా అత్యాధునిక పరికరాలతో అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేశారని తెలిపారు. సదరు జిమ్ లలో ఆధునిక వెయిట్ లిఫ్టింగ్ పరికరాలు, త్రేడ్ మిల్స్, స్టీం బాత్ మరియు ఇతర పరికరాలు ఏర్పాటు చేయుటకు ప్రణాళికలు సిద్దం చేశారన్నారు. అంతేకాక ఎన్.టి.ఆర్ స్టేడియంలోని వాకింగ్ ట్రాక్, టెన్నిస్, వాలీ బాలల్ కోర్ట్ లలో సమస్యలేమైనా ఉంటె వాటికీ కూడా పూర్తి స్తాయిలో మరమ్మతులు చేయిస్తామన్నారు. అదేవిధంగా వాకింగ్ చేయుటకు స్టేడియానికి వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా గ్రీనరి అభివృద్ధి చేయాలని, దానికి అవసరమైన మొక్కలను నాటాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇంకా స్టేడియంలో అసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సదరు సమావేశం ఎన్.టి.ఆర్ స్టేడియం సెక్రటరీ వజ్జా రామాక్రిష్ణ, కమిటీ మెంబర్లు, ఆకాష్ ఆర్కిటెక్ సూరజ్ వారి ప్రతినిధులు, నగర పాలక సంస్థ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *