Breaking News

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గొట్టిపాటి రవి కుమార్

పల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల సంక్షేమం, సామాజిక భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. సోమవారం పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం కండ్లగుంట గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి సామాజిక పింఛన్లను స్వయంగా అందజేశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర అర్హులైన లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 5,606 స్పౌజ్ పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. ప్రతి నెలా 63 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఒకటో తేదీనే పింఛన్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు అండగా నిలుస్తూ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సామాజిక పింఛన్ల కోసం కూటమి ప్రభుత్వం ఏటా సుమారు రూ.34 వేల కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సామాజిక పింఛన్ల కోసం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో రూ.65,886.57 కోట్లు పింఛన్ల రూపంలో లబ్ధిదారులకు అందించిందని వెల్లడించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధితో పాటు సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *