Breaking News

రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఐఆర్‌పై సమీక్ష సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)-2026 ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నాటికి సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 2,77,822 మంది ఓటర్లలో 2,59,724 మంది వివరాలను డిజిటలైజ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. వీరిలో 2002 ఓటరు జాబితాలో వారికి లేదా వారి కుటుంబ సభ్యులకు ఓటు ఉన్న 1,99,564 మంది ఓటర్లను మ్యాపింగ్ చేయగా, 2002 ఓటరు జాబితాలో ఓటు లేకపోయినా 60,160 మంది ఓటర్ల వివరాలను “నో మ్యాపింగ్” కింద డిజిటలైజ్ చేసినట్లు వివరించారు. అలాగే 14,833 మంది ఓటర్లు అన్‌కలెక్టబుల్ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్) విభాగంలో ఉన్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఏఈఆర్వోలు కె. ప్రభుదాస్, వి. దివ్య, కె. లక్ష్మి, ఎస్‌డీటీ (EPIC) ఎస్. సురేష్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు అన్సారి (ఐఎన్‌సీ), ఎన్. వీరభద్రరావు (సీపీఐ), బి. రమణారావు (సీపీఎం), ఎన్. సాంబశివరావు (టీడీపీ), జి. సుందర్ పాల్ (వైఎస్సార్‌సీపీ), బి. వంశీకృష్ణ (జనసేన) పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోలవరానికి పర్యాటక శోభ

-ప్రాజెక్టుతో పాటు గోదావరి తీరంలో టూరిజం అభివృద్దికి మాస్టర్ ప్లాన్ -అఖండ గోదావరి ప్రాజెక్టు కింద నదీతీరం అభివృద్ది -అధికారులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *